Thursday, November 21, 2024

HYD: గుండెపోటు, డిస్క్ ప్రోలాప్స్‌తో బాధపడుతున్న రోగిని రక్షించిన సిటిజన్స్ స్పెషాలిటీ వైద్యులు

హైదరాబాద్ : ఇటీవల గుండెపోటు ఎదుర్కోవటంతో పాటుగా డిస్క్ ప్రోలాప్స్‌తో బాధపడుతున్న 35 ఏళ్ల రోగికి చికిత్స కోసం మల్టీడిసిప్లినరీ విధానం అనుసరించటం ద్వారా రోగి-కేంద్రీకృత సంరక్షణలో సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ మార్గదర్శకంగా నిలిచింది. తొలుత సుజిత్ రెడ్డి (పేరు మార్పు) ఛాతీ నొప్పితో హాస్పిటల్ కు వచ్చారు. ఆయనకు మధుమేహం, రక్తపోటు చరిత్ర వుంది. తదుపరి పరీక్షల తర్వాత, రోగికి గుండెపోటు ఉన్నట్లు నిర్ధారణ అయింది. సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని కార్డియాక్ టీమ్ వేగంగా జోక్యం చేసుకుని, అతనికి స్టెంట్‌ వేయడంతో పాటు అతను త్వరగా కోలుకోటానికి అవసరమైన చికిత్స ప్రారంభించి రోగిని ర‌క్షించింది.

ఈసంద‌ర్భంగా సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గురు చైతన్య కుమార్ సిఈ కేసు గురించి మాట్లాడుతూ… అత‌నికి గుండెపోటుకు సంబంధించిన కరోనరీ జోక్యం కారణంగా ఒక ప్రత్యేకమైన సవాలును అందించిందన్నారు. స్టెంట్ ప్లేస్‌మెంట్‌ కారణంగా స్టెంట్‌కు అడ్డుపడకుండా నిరోధించడానికి బ్లడ్ థిన్నర్‌లను కొనసాగించడం అతనికి కీలకమ‌న్నారు. యాంటీప్లేట్‌లెట్ యాక్షన్, శస్త్ర‌చికిత్స జోక్యాన్ని సమతుల్యం చేయడంలో ఇంజెక్షన్ కాంగ్రేలర్ కీలక పాత్ర పోషించటంతో పాటుగా రోగికి మెరుగైన ఫలితాలను అందించిందన్నారు.

సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ రాజేష్ రెడ్డి సన్నారెడ్డి మాట్లాడుతూ… వివరిస్తూ.. శ్రీ రెడ్డి తరహా కేసుల్లో అంటే, హృదయనాళ, నాడీ శస్త్ర చికిత్సలు కలిసేటటువంటి సందర్భాల్లో, అనుకూలమైన విధానం తప్పనిసరన్నారు. ఇంజెక్షన్ కాంగ్రేలర్ ఉపయోగం అవసరమైన యాంటీ ప్లేట్‌లెట్ చర్యను అందించిందన్నారు. ఇది సురక్షితమైన చికిత్స, రోగి సంరక్షణ కోసం వినూత్న వ్యూహమ‌న్నారు. సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్సీఓఓ డాక్టర్ ప్రభాకర్ పి మార్గదర్శక చికిత్సలకు ఆసుపత్రి నిబద్ధతను నొక్కి చెబుతూ… సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో, తాము రోగుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. అన్నింటికంటే ఎక్కువగా మెరుగైన ఫలితాలకు కృషి చేస్తుంటామన్నారు. శ్రీరెడ్డి ఉదంతం ఆవిష్కరణ, సహకారానికి త‌మ అచంచలమైన అంకితభావాన్ని ఉదాహరణగా చూపుతుందన్నారు. రోగులు అత్యున్నత స్థాయి సంరక్షణను అందుకోగలమనే భరోసా అందిస్తుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement