Tuesday, November 19, 2024

కొండెక్కిన కోడి – కిలో జెస్ట్ రూ.260

హైదరాబాద్‌, : చికెన్‌ ధరలు పెరిగాయి.. ఆదివారం నాడు మార్కె ట్లో కేజీ చికెన్‌ ధర రూ.260 పలికింది. గత వారం వరకు రూ.200 నుంచి 230 వరకు ఉన్న ధర ఆదివారం రూ.260 కావడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. జనవరి మాసం వరకు బర్డ్‌ ఫ్లూ వ్యాధి నేప థ్యంలో చికెన్‌ ధరలు తగ్గడంతో పాటు క రోనా సమయంలోనూ తగ్గించే విక్రయించిన వ్యాపారులు ఇపుడు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండు తుండడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడం… వినియోగం పెరగడంతో ధరలు పెరిగినట్టు వ్యాపార స్తులు చెబుతున్నారు. ఏటా వేసవిలో చికెన్‌ ధరలు పెరగడం సాధారణ మేనని పేర్కొం టున్నారు. వేసవికాలంతో పాటు బర్డ్‌ ఫ్లూ భయంతో చాలా వరకు పౌల్ట్రి రైతులు, కొన్ని కంపెనీలు వాళ్ల సామర్థ్యానికి తగ్గట్టుగా కోళ్లను పెంచలె దని కూడా తెలుస్తోంది. వాస్తవానికి కూడా పెద్ద కంపెనీ ల సిండికేట్‌ వ్యవహారంతో వేసవిలో కోళ్లను పెంచేం దుకు రైతులు వెనకడుగు వేస్తున్నారని కూడా సూర్యా పేట జిల్లాకు చెందిన పౌల్ట్రి రైతు ఒకరు చెబుతున్నారు.
జూన్‌లో తగ్గే ఛాన్స్‌..
చికెన్‌ ధరలు జూన్‌ తరువాత తగ్గే అవకాశం ఉండనుంది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసు కుంటున్న నేపథ్యంలో చాలా వరకు పౌల్ట్రి రైతులు కోళ్లను పెంచలేదు. ఇపుడున్న వాతావరణ పరిస్థితులతో పెద్దగా మార్పులు ఉండవన్న ఆలోచనతో ఈ నెలలో పిల్లలను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేయనున్నారు. పిల్ల నుంచి కేజీన్నర, 2కేజీల కోడిగా రావాలంటే కనీసం 38నుంచి 42 రోజుల సమయం పడుతుండడంతో జూన్‌ నుంచి చికెన్‌ ధరలు తగ్గే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement