ప్రభ న్యూస్, హైదరాబాద్ (ప్రతినిధి) : మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఇకపై రాత్రి 11గంటల వరకు మెట్రోలో ప్రయాణించవచ్చని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం రాత్రి 10.15గంటల వరకే టర్మినల్ సేషన్ల నుంచి చివరి మెట్రోస్టేషన్ వరకు ఉన్న సమాయన్ని మారుస్తున్నట్లు తెలిపింది. ఈనెల 10నుంచి టర్మినల్ స్టేషన్లలో చివరి మెట్రోరైలు రాత్రి 11గంటలకు బయలుదేరుతుందని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ. ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మెట్రోరైలు వేళలు పొడిగించినట్లు చెప్పారు. ఎప్పటి లాగే ఉదయం 6గంటల నుంచి మెట్రోసేవలు ప్రారంభమవుతాయి. ప్రయాణీకుల నుంచి క్రమంగా ఆదరణ పెరుగుతుండటంతో మెట్రోరైలు వేళలను క్రమంగా పొడిగించుకుంటూ వస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -