Thursday, November 21, 2024

HYD: రెండేళ్లలో రూపురేఖలు మారనున్న చంపాపేట్ బైరమల్ గూడా రోడ్డు… ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కర్మన్ ఘాట్, ఆగస్టు 23 (ప్రభ న్యూస్) మరో రెండు సంవత్సరాల్లో చంపాపేట్ బైరమల్ గూడా ప్రధాన రహదారి రూపురేఖలు మారనున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. దుర్గా భవాని నగర్ లో రూ.45 లక్షలతో యుజిటీ పనులకు ఎస్వి కాలనీలో రూ.29 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త సీనియర్ నాయకులు నల్ల రఘుమారెడ్డితో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. శుభోదయం కాలనీలో 89 లక్షలతో నిర్మించిన మినీ ఫంక్షన్ హాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయా కాలనీలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తెచ్చారని, ఆ సమస్యలను త్వరలో పరిష్కరించనున్నట్లు తెలిపారు.

చంపాపేట్ నుండి బైరమల్ గూడా వరకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. చంపాపేట్ డివిజన్ లో మరో 7, 8 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల చేయలేకపోయామని, త్వరలో ఆ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ సురేష్, డివిజన్ అధ్యక్షులు ముడుపు రాజ్ కుమార్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు రోజా రెడ్డి, హనుమాన్ దేవాలయం ధర్మకర్తలు చీర తిరుమలేష్, మేక సురేందర్ రెడ్డి, చేగోని సురేష్, గోగిరెడ్డి అంజిరెడ్డి నాయకులు చీర శ్రీనివాస్, ఊరుకొండ రమాదేవి, గోకుల్ సరోజ, బొంబాయి, ఆకుల రమాకాంత్ గుప్తా, వసంత రెడ్డి, కాలనీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కేశవరెడ్డి, ఆకుతోట వెంకట్ గుప్తా, నరేష్, గౌరిదేవి రాజు, వెంకటేష్, కృష్ణ, చందర్, జయసింహారెడ్డి, నిష్కాంత్ రెడ్డి, రత్నమాచారి, నరసింహ, మురళీధర్ రెడ్డి, డాక్టర్ రంగారెడ్డి, దిలీప్ రెడ్డి, రామకృష్ణ, సుధాకర్ రెడ్డి, ప్రభాకర్, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement