Tuesday, November 26, 2024

తెలంగాణ లో ప్రజాస్వామ్యం కరువైంది …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

ఎల్బీనగర్ – తెలంగాణ లో ప్రజాస్వామ్యం కరువైందని .. ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ ప్రజల హక్కులను హరించి వేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు .తెలంగాణ రాష్ట్రంలో కరొణ సమయంలో ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడ్డ 52 మంది విశ్వబ్రాహ్మణుల కుటుంబాలను ఆదుకోవాలని …పంచ వృత్తులు పరిరక్షణ సంక్షేమ హక్కుల సాధనకై ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయ బండి పాండురంగ చారి ఆధ్వర్యంలో సైకిల్ జాత కార్యక్రమాన్ని ఈనెల 18న ఖమ్మంలో ప్రారంభించి సోమవారం రాత్రి ఎల్బినగర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన చాడ వెంకట్ రెడ్డి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచి వ్యక్తిగత సంక్షేమం కోసం పాటు పడుతుందన్నారు. శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకై ఆత్మాహుతి అయ్యాడని అలాంటి జాతికి అన్యాయం చేయడం బాధాకరమన్నారు .ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదన్నారు .పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకుంటామని పంచ వృత్తిదారులు ఏకతాటిపై వచ్చి తమ హక్కుల సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. విశ్వబ్రాహ్మణులకు ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు బీసీ సంక్షేమనికి ప్రభుత్వం అన్యాయం చేశారని బీసీ ఫెడరేషన్ కు నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే బీసీలపై చిన్నచూపు చూస్తున్నారని అర్థమవుతోందన్నారు కరోనా సమయంలో ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నా వృత్తిదారులకు ప్రభుత్వం వెంటనే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రవీంద్ర చారి సంఘం ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు నా గోజు రామాచారి ప్రధాన కార్యదర్శి పర్వతం శ్రీనివాసాచారి కోశాధికారి కృష్ణమాచారి ప్రచార కార్యదర్శి శ్రీనివాసాచారి పర్వతం ప్రేమ్ కుమార్ యువజన అధ్యక్షులు పడకండి వెంకటాచారి భాస్కరాచారి బాలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement