ఖైరతాబాద్ (ప్రభ న్యూస్) : నగరంలోని ప్రధాన మల్టీస్పెషాలిటీ- ఆస్పత్రి లో ఒక-టైన సెంచురీ ఆస్పత్రి డయాలసిస్ ధరలను గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించింది. సెషన్‌కు కేవలం రూ. 1400 మాత్రమే తీసుకోనున్నట్లు ప్రకటించారు ఆస్పత్రి యాజమాన్యం. చాలా వరకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇది రూ.3వేలకు పైగా ఉందని, నగరంలో గల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల్లో అన్నిటిలోకి సెంచురీ ఆస్పత్రిదే అతితక్కువ ధర కావడంతో తరచు డయాలసిస్ అవసరమయ్యే వందలాది మంది రోగులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. డయాలసిస్ అవసరుమున్న వారు ఆస్పత్రి నంబరు 040-67833333కు ఫోన్ చేసి ఈ రాయితీ ధరలను పొందవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా సెంచురీ ఆస్పత్రి సీఈవో డాక్టర్ హేమంత్ కౌకుంట్ల మాట్లాడుతూ.. మూత్రపిండాల రోగులకు డయాలసిస్ దీర్ఘకాలం పాటు అవసరం అవుతుందని, మూత్రపిండాల రోగులు, వారి కుటుంబసభ్యుల పట్ల మానవత్వంతో సెంచురీ ఆస్పత్రి యాజమాన్యం డయాలసిస్ ధరను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించిందన్నారు. నాణ్యమైన డయాలసిస్ చికిత్స, నిపుణులైన వైద్యబృందం, ఆహారసలహాలు ఇచ్చేందుకు కౌన్సెలింగ్, డయాలసిస్ రోగుల సంరక్షణ, ఇతర ఉత్తమ లక్షణాలన్నీ సెంచురీ ఆస్పత్రి నెఫ్రాలజీ బృందంలో ఉన్నాయని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..