Tuesday, November 26, 2024

18 నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2023.. కొత్త ఫార్మాట్‌ తో T20మ్యాచ్ 10 ఓవర్ల 2 ఇన్నింగ్స్‌

సెలబ్రిటీ క్రికెట్ లీగ్( సీసీఎల్) 2023 మునుపెన్నడూ లేనంతగా మరింత వినోదాత్మకంగా ఉంటుందని వాగ్దానం చేసే అద్భుతమైన సీజన్‌తో తిరిగి వచ్చింది. సరికొత్త ఫార్మాట్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా T20 మ్యాచ్ 10 ఓవర్ల 2 ఇన్నింగ్స్‌లలో ఆడనున్నారు. ఈ సరికొత్త ఫార్మాట్‌లో చలనచిత్ర పరిశ్రమలకు చెందిన (తెలుగు వారియర్స్, కర్నాటక బుల్డోజర్స్, చెన్నై రైనోస్, కేరళ స్ట్రైకర్స్, బెంగాల్ టైగర్స్, భోజ్‌పురి దబాంగ్స్, ముంబై హీరోలు, పంజాబ్ దే) ఎనిమిది టీమ్‌లు ప్రాతినిధ్యం వహించనున్నాయి. సినిమా స్టార్స్‌ అందరూ కలిసి ఆడే ఈ క్రికెట్ తో తమ అభిమానులకు మరింత వినోదాన్ని అందించనున్నారు. సీసీఎల్ 2023 క్రౌన్ దక్కించుకోవడానికి ఎనిమిది రాష్ట్రాల నుంచి సినిమా తారలు పోటీ పడుతున్నారు. స్కిల్ బేస్డ్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ – A23 ఆన్‌బోర్డింగ్‌ను ఈ సీజన్ ప్రెజెంటింగ్ స్పాన్సర్‌గా సీసీఎల్ ప్రకటించింది. పార్లే CCL -2023కి టైటిల్ స్పాన్సర్‌ ఉంది. ఈ సందర్భంగా మార్కెటింగ్ A23 వైస్ ప్రెసిడెంట్ గున్నిధి సింగ్ సరీన్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానుల దృష్టిని ఆకర్షించే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తో భాగస్వామ్యం కావడం పట్ల తాము సంతోషిస్తున్నామన్నారు. ఈ భాగస్వామ్యం త‌మ బ్రాండ్ అవగాహన మెరుగుపరచడంలో త‌మకు సహాయపడుతుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. CCLతో విజయవంతమైన సహకారం కోసం తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ… CCL భారతదేశంలో క్రీడారంగంలో అగ్రగామిగా ఉందని, త‌మ అభిమానుల కోసం దీనిని తిరిగి తీసుకురావడం పట్ల తాము గర్విస్తున్నామన్నారు. నటుడు-నిర్మాత రితీష్ దేశ్‌ముఖ్ ముంబయి హీరోలకు, పంజాబ్ డి షేర్ కెప్టెన్‌గా నటుడు సోనూ సూద్, భోజ్‌పురి దబాంగ్స్‌కు నటుడు మనోజ్ తివారీ కెప్టెన్‌గా ఉన్నారు. నటుడు జిషు సేన్‌గుప్తా బెంగాల్ టైగర్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. కర్ణాటక బుల్డోజర్స్‌కు నటుడు కిచ్చా సుదీప్ లీడ్ చేస్తున్నారు. తెలుగు వారియర్స్ నటుడు అఖిల్ అక్కినేని నేతృత్వం వహించనున్నారు. కేరళ స్ట్రైకర్స్‌కు నటుడు కుంచాకో బోబన్ కెప్టెన్‌గా ఉన్నారు. నటుడు ఆర్య చెన్నై రైనోస్‌కు కెప్టెన్‌గా ఉన్నారు. మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం.. ప్రత్యేకంగా 6 వేర్వేరు ఛానెళ్ల‌లో ZEE TV నెట్‌వర్క్‌లో ప్రసారం కానున్నాయి. సీసీఎల్ మొత్తం 19 గేమ్‌లు జీ అన్మోల్ సినిమా, హోమ్ టీమ్ 4 లీగ్ మ్యాచ్‌లు, 2 సెమీస్ + 1 ఫైనల్‌లో వాటి సంబంధిత ప్రాంతీయ భాషా వ్యాఖ్యానంలో ప్రసారం చేయనున్నారు. ముంబై హీరోల మ్యాచ్‌లు, పిక్చర్స్ హిందీలో ప్రసారం చేస్తారు. PTC పంజాబ్ పంజాబ్ దే షేర్, జీ సినిమాలూ, జీ తిరై, జీ పిచార్, జీ బిస్కోప్, జీ బంగ్లా మ్యాచ్‌లను ప్రసారం చేస్తుంది. తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, భోజ్‌పురి మ్యాచ్‌లను ప్రసారం చేస్తుంది. దబాంగ్స్, బెంగాల్ టైగర్స్ అండ్ కేరళ స్ట్రైకర్స్ మ్యాచ్‌లు ఫ్లవర్స్ టీవీలో ప్రసారమ‌వుతాయి. ఫిబ్రవరి18వ తేదీ నుంచి రాయ పూర్, జైపూర్, బెంగళూర్, త్రివేండ్రం, జోద్ పూర్, హైదరాబాద్ లలో ఈ పోటీలు జరగనున్నాయి. మార్చి 19వ తేదీ ఫైనల్ పోరు జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement