Saturday, November 16, 2024

Almonds : బాదంతో తోబుట్టువుల బంధాన్ని వేడుక చేసుకోండి

హైద‌రాబాద్ : పండుగ సీజన్ ప్రారంభాన్ని రక్షా బంధన్ సూచిస్తుంది. తమ సోదరుల ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం తోబుట్టువులు ప్రార్థిస్తే , తమ సోదరీమణులను ఆదుకుంటామని, వారికి రక్షణ కల్పిస్తామని, వారి ఆరోగ్యం, ఆనందం కాపాడతామని సోదరులు ప్రతిజ్ఞ చేస్తారు. ఈ హృదయపూర్వక నిబద్ధతను గౌరవించడానికి, మీ రోజువారీ ఆహారంలో బాదం వంటి పోషకమైన ఆహారాలను చేర్చడం ద్వారా ఈ రక్షా బంధన్‌ను మరింత అర్ధవంతం చేసుకోండి.

ఈసందర్భంగా బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ… రక్షాబంధన్ తనకు, తన కుటుంబానికి ప్రత్యేకమైన రోజన్నారు. ప్రతి సంవత్సరం తాము కలిసి జరుపుకుంటామన్నారు. తాను ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన డెజర్ట్‌, గ్రిల్డ్ బాదం బర్ఫీని తయారు చేస్తానన్నారు.

ఢిల్లీ మాక్స్ హెల్త్‌కేర్ రీజినల్ హెడ్-డైటెటిక్స్ రితికా సమద్దర్ మాట్లాడుతూ… రక్షా బంధన్ వంటి పండుగల సమయంలో బాదం వంటి ఆహార ఎంపికలను చేసుకోవడం ద్వారా పండుగలను ఆరోగ్యకరమైన రీతిలో ఆస్వాదించాలని తాను సిఫార్సు చేస్తున్నానన్నారు. బాదంపప్పులు అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయన్నారు.

- Advertisement -

న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… రక్షా బంధన్ సందర్భంగా స్వీట్ ట్రీట్‌లు చాలా మంది ఇష్టపడతారు. కానీ పోషకాహార నిపుణురాలిగా, బాదం పప్పులు, తాజా పండ్లు మొదలైన సహజమైన, ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకోవాలని తాను సిఫార్సు చేస్తున్నానన్నారు. బాదంలో ప్రోటీన్ అండ్ డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయన్నారు. స్కిన్ ఎక్స్‌పర్ట్ అండ్ కాస్మోటాలజిస్ట్, డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా మాట్లాడుతూ… పండుగల సమయంలో మీరు తినే ఆహరం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బాదం వంటి సహజ ఆహార ఎంపికలపై దృష్టి పెట్టాలని తాను సిఫార్సు చేస్తున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement