Tuesday, November 12, 2024

Almonds: బాదంపప్పుల ఆరోగ్యకరమైన ట్విస్ట్‌తో హార్వెస్ట్ సీజన్‌ను వేడుకగా జరుపుకోండి!

హైదరాబాద్: హార్వెస్ట్ ఫెస్టివల్ భారతదేశంలో ఒక ముఖ్యమైన వేడుక, ఇది దేశవ్యాప్తంగా విభిన్న సంప్రదాయాలతో గుర్తించబడుతుంది. పంటల సమృద్ధికి కృతజ్ఞతా పూర్వకంగా, రైతులు, కమ్యూనిటీల సమిష్టి ప్రయత్నాలలో సంతోషించాల్సిన సమయంగా ఇది నిలుస్తుంది. ఈ సందర్భంగా ఫిట్‌నెస్ నిపుణులు, సెలబ్రిటీ మాస్టర్ ఇన్‌స్ట్రక్టర్ యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ… ఆరోగ్యం విలువైనది కాబట్టి, ప్రియమైన వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు, క్యాలరీలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాల నుండి బాదం వంటి ఆరోగ్య స్పృహతో కూడిన ప్రత్యామ్నాయానికి మారడాన్ని పరిగణించాలన్నారు. పోషకాహార, వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… సాంప్రదాయ స్వీట్‌లకు ఒక ప్రత్యామ్నాయ ఆరోగ్యకరమైన ఎంపిక బాదం అన్నారు. బాదం అనేక పోషకాలకు మూలం, అవి అనేక సాంప్రదాయ భారతీయ వంటకాలలో సులభంగా స్వీకరించగలవన్నారు.

ఢిల్లీ మాక్స్ హెల్త్‌కేర్ రీజ‌న‌ల్ హెడ్ రితికా సమద్దర్ మాట్లాడుతూ… బాదం పప్పు పోషక శక్తికి మారడం ద్వారా దీనిని నియంత్రించడానికి మంచి మార్గాలున్నాయ‌న్నారు. ఆల్ట్రా-ప్రాసెస్ చేసిన స్నాక్స్‌ను బాదంపప్పులతో భర్తీ చేయడం, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన ఎంపిక అన్నారు. ఇంటిగ్రేటివ్ న్యూట్రిషనిస్ట్, హెల్త్ కోచ్, డాక్టర్ రోహిణి పాటిల్ మాట్లాడుతూ… బాదంపప్పులలో విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉన్నందున బాదం మీ ఆహారంలో ఆరోగ్యకరమైన అదనంగా ఉంటుందన్నారు.

ప్రఖ్యాత కన్నడ నటి, ప్రణీత సుభాష్ మాట్లాడుతూ… బాదం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే బహుమతిగా ప్రసిద్ధి చెందినందున తాను బహుమతులతో పాటు బాదం పప్పుల బాక్సును కూడా ప్యాక్ చేసేలా చూసుకుంటానన్నారు. ప్రఖ్యాత దక్షిణ భారత చలనచిత్ర అండ్ టెలివిజన్ నటి, వాణీ భోజన్ మాట్లాడుతూ… త‌మ కుటుంబ సంప్రదాయంలో భాగంగా మా ఇంట్లో పొంగల్ జరుపుకుంటారన్నారు. అయితే తాను ఇంట్లో చేసిన వంట‌ల‌తో పాటు బాదం పప్పులను చేరుస్తానన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement