హైదరాబాద్ : ఉత్సవాల నెల ప్రారంభమైంది. తోబుట్టువుల మధ్య మధురమైన బంధం వేడుక చేసే రక్షా బంధన్ దగ్గరలోనే ఉంది. ఈసందర్భంగా చక్కటి ఆరోగ్యం కోసం బాదం బహుమతితో మీ తోబుట్టువుల మధ్య బంధాన్ని వేడుకగా చేసుకోండి. ఈ సందర్భంగా ప్రఖ్యాత బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ…. రక్షాబంధన్ అనేది అందరికీ ఆనందం, ఉత్సాహాన్ని కలిగించే పండుగ, తోబుట్టువుల మధ్య అనేక భావోద్వేగాలను రేకెత్తిస్తుందన్నారు. బాదంపప్పులు మన అన్ని వేడుకలలో, ముఖ్యంగా రక్షా బంధన్‌లో భాగమన్నారు. అవి ఆరోగ్యకరమైనవి, రుచికరమైనవన్నారు. తన కుటుంబానికి ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులు ఉండేలా చూసుకుంటానన్నారు.
ఎంబీబీఎస్ అండ్ పోషకాహార నిపుణులు, డాక్టర్ రోహిణి పాటిల్ మాట్లాడుతూ.. బాదంపప్పులు అందించనంతగా ఏ బహుమతి కూడా కేర్ ని అందించదన్నారు. ఆరోగ్యం అనేది మనం తప్పక మెచ్చుకోవాల్సిన విలువైన ఆస్తి అని తాను నమ్ముతున్నానన్నారు. రీజినల్ హెడ్-డైటెటిక్స్, మాక్స్ హెల్త్‌కేర్ – ఢిల్లీ, రితికా సమద్దర్ మాట్లాడుతూ… బాదం, ఆహారం నుండి శక్తిని విడుదల చేయడంలో సహాయపడే విటమిన్ బీ2, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉందన్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయ పడుతుందన్నారు.
న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… మనలో చాలా మంది మన తోబుట్టువులకు రాఖీ కట్టే ముందు ఉపవాసం ఉండే ఆచారాన్ని పాటిస్తారు, వేడుక తర్వాత బాదం తినడం వల్ల మంచి కొవ్వులు ఉంటాయి కాబట్టి శక్తి లభిస్తుందన్నారు. సెలబ్రిటీ పిలేట్స్ మాస్టర్ ఇన్‌స్ట్రక్టర్, యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ… ఆరోగ్యకరమైన జీవనశైలిపై దృష్టి సారిస్తూ, తెలివైన ఆహార ఎంపికలు చేసుకోవడం, చురుకుగా ఉండడం ముఖ్యమన్నారు. ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం అన్ని వయసుల వారికి మేలు చేస్తుందన్నారు.
స్కిన్ ఎక్స్‌పర్ట్ అండ్ కాస్మోటాలజిస్ట్ డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా మాట్లాడుతూ… సోదరులు తమ సోదరీమణులకు బహుమతిగా ఇవ్వడానికి బాదం గొప్ప బహుమతి. బాదంపప్పులో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల చర్మానికి సహజమైన మెరుపు లభిస్తుందన్నారు. ఆయుర్వేద నిపుణురాలు, డాక్టర్ మధుమిత కృష్ణన్ మాట్లాడుతూ… రక్షాబంధన్ సందర్భంగా బహుమతి విషయానికి వస్తే బాదంపప్పులు ఒక అద్భుతమైన ఎంపిక అన్నారు. ప్రముఖ దక్షిణ భారత నటి అండ్ సెలబ్రిటీ, ప్రణీత సుభాష్ మాట్లాడుతూ… రోజువారీ ప్రాక్టీస్‌గా, ఆహారంలో అవసరమైన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే వస్తువులను చేర్చుకోవాలని తాను సూచిస్తున్నానన్నారు.