Friday, November 15, 2024

HYD: 25యుఎస్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో కెరీర్ మొజాయిక్ సమావేశం..

హైద‌రాబాద్, ఆగ‌స్టు 22 (ప్ర‌భ న్యూస్) : 450కు పైగా యుఎస్ విశ్వవిద్యాలయాలు, 900కు పైగా ప్రముఖ ప్రపంచ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణాసియాలోని అతిపెద్ద విద్యార్థుల నియామక సంస్థ కెరీర్ మొజాయిక్ హైదరాబాద్‌లో 25 యుఎస్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించింది. కొత్త కోర్సులు, స్కాలర్‌షిప్‌లు అండ్ తదితర అంశాలను పంచుకోవడంపై ఈ విశ్వవిద్యాలయాలు దృష్టి సారించి, కళాశాల క్యాంపస్‌లలోని విద్యార్థులు, కళాశాల సలహాదారులు, ఆంధ్రప్రదేశ్ (ఏపీ) తెలంగాణా నుండి స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్‌లతో సమావేశమయ్యాయి.

కెరీర్ మొజాయిక్ వ్యవస్థాపకుడు అండ్ డైరెక్టర్ అభిజిత్ జవేరి మాట్లాడుతూ… ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ – తెలంగాణలోని విద్యార్థులకు విద్యావకాశాలను మెరుగ్గా తీసుకురావాలనే లమ అచంచలమైన నిబద్ధతను వెల్లడిస్తుందన్నారు. ఈ రాష్ట్రాలు భారతదేశం అంతర్జాతీయ విద్యారంగంలో కీలకమైన మార్కెట్‌లుగా ఉద్భవించాయన్నారు. ప్రత్యేకించి టైర్-2, టైర్-3 నగరాల నుండి దరఖాస్తులు గణనీయంగా పెరిగాయన్నారు.

గ్లోబల్ ఎడ్యుకేషన్ పట్ల విద్యార్థుల పెరుగుతున్న ఆకాంక్షలను ఇది ప్రతిబింబిస్తుందన్నారు. 450కి పైగా యుఎస్ విశ్వవిద్యాలయాలు, అగ్రశ్రేణి గ్లోబల్ సంస్థలతో తమ విస్తృతమైన నెట్‌వర్క్ ఈ ప్రాంతాల విద్యార్థుల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి తగిన మార్గదర్శకత్వాన్ని అందించడానికి తమకు సహాయం చేస్తుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement