కవాడిగూడ : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమద్దీకరించి పిఆర్సి ప్రకారం వేతనాలు చెల్లించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖ లలో లక్షా 20 వేల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఆయన తె లిపారు. విద్యానగర్ లోని బిసి భవన్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు న్యాయపరమై చిక్కులు వస్తున్నందున అసెంబ్లిdలో చట్టం చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగులను క్రమబద్దీరించేందుకు ప్రభుత్వం జీవోలు ఇస్తుంటే హై కోర్టు స్టేలు ఇస్తుందని, అలాంటి న్యాయపరమైన చిక్కుల రాకుండా చట్టంచేస్తే ఏ ఇబ్బంది ఉండదన్నారు. చాలామంది ఉద్యోగుల కాలపరిమితి దాటిపోతుందని, ఇతర ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకోని తప్పనిస రిగా చట్టం చేయాలని ఆయన చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement