రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఫోన్ ఎంత తక్కువగా వాడితే అంత మంచిదని, 6 నెలలు సినిమాలకు దూరంగా ఉండండని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. పీర్జాదిగూడ పరిధిలో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి ఉచిత కోచింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొద్దిగా క్రికెట్ తక్కువ చూడండి.. ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలను బంద్ చేసి చదువుపై దృష్టి సారించాలన్నారు. ఫోన్ తక్కువగా వాడితేనే లాభం ఉంటుందని, మీ తల్లిదండ్రులను సంతోషపెట్టే విధంగా భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకోవాలని ఉద్యోగ అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంమ్మెల్సీ నవీన్ రావు, ఎంమ్మెల్యే సుభాష్ రెడ్డి, కలెక్టర్ హరీష్, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, బుచ్చి రెడ్డి, కావ్య, డిప్యూటీ మేయర్లు శివ గౌడ్, లక్ష్మి గౌడ్, తెరాస పార్టీ నాయకులు dr భద్రా రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు పావని యాదవ్, ప్రణిత గౌడ్, మాజీ ఎంమ్మెల్యే సుదీర్ రెడ్డి, కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, నాయకులు, యువత పాల్గొన్నారు.