రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మౌలాలి-సనత్‌నగర్ స్టేషన్ల మధ్య జరుగుతున్న నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటీఎస్‌లు, 10వ తేదీ వరకు మరో రెండు, 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు.
మౌలాలి-అమ్ముగూడ-సనత్‌నగర్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు కొనసాగుతున్నాయి. అందుకే దాదాపు 51 రైళ్లను అధికారులు రద్దు చేశారు. 4 నుంచి 11 వరకు టైమ్‌టేబుల్ వారీగా రైళ్ల రద్దు ఉంటుందన్నారు. ఈ క్రమంలో సాధారణ రైళ్లతో పాటు ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు.
హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, వికారాబాద్-గుంటూరు, రేపల్లె- సికింద్రాబాద్‌తో పాటు లింగంపల్లి-హైదరాబాద్, లింగంపల్లి-ఉందానగర్, లింగంపల్లి-ఫలక్‌నుమా వంటి పలు స్టేషన్ల మధ్య కూడా టైమ్ టేబుల్ ప్రకారం ఎంఎంటీఎస్‌లను రద్దు చేసినట్టు వెల్లడించారు.