హైదరాబాద్ – బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయన ఇంకా జ్వరం నుంచి కోలుకోలేదు. దీంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. అయితే మళ్లీ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ, అక్టోబరు మొదటి వారంలో కేబినెట్ భేటీ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
గత వారం రోజులుగా యశోద వైద్యులు సీఎం కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. గతంలో కేసీఆర్‌కు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఈసారి కేసీఆర్‌కు ప్రగతి భవన్‌లోని యశోద ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.