కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఇవ్వాల (గురువారం) సాయంత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత, నియోజవకర్గ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. ఇక.. ఆయన సతీమణి బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న కూడా రామ్మోహన్గౌడ్తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాగా, గురువారం ఉదయం బి.ఎన్.రెడ్డి నగర్ లోని తన నివాసంలో రామ్మోహన్ గౌడ్ ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం కార్యకర్తలు, అనుచరుల అభిప్రాయాలు తెలుసుకున్నాక కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది.