హైదరాబాద్‌లోని అమీర్‌పేట మెట్రో స్టేషన్లో మంగళవారం నాడు బాంబు పేరుతో అలజడి రేగింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కి పడ్డారు. అయితే మెట్రో స్టేషన్ డస్ట్ బిన్లో ఎలక్ట్రానిక్ పరికరం వైబ్రేషన్ కావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే వారు 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, స్థానిక పోలీసులు మెట్రో స్టేషన్ మొత్తం తనిఖీలు చేపట్టారు.
చివరకు డస్ట్ బిన్లో పనిచేయని సెల్‌ఫోన్‌ను అధికారులు గుర్తించారు. ఆ ఫోన్ పనిచేయకపోవడంతో దానిని డస్ట్ బిన్లో పడేసి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా బాంబు లేదని తెలియడంతో పోలీస్ యంత్రాంగంతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వార్త కూడా చదవండి: పులివెందులలో లాకప్‌డెత్ కలకలం.. రాత్రికి రాత్రే మృతదేహం దహనం