హైదరాబాద్ – బిజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి భవర్ లాల్ వర్మ కరోనాతో కన్నుమూశారు.. గత నెల 28న కరోనా భారీన పడిన ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పటల్లో చికిత్స కోసం చేరారు.. కరోనా తో పాటు నిమోనియా వ్యాధి కూడా చేకూరడంతో రోజురోజుకు వారి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన శనివారం ఉదయం మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. కాగా, వర్మ సనత్ నగర్ నియోజకవర్గ మొండా డివిజన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి . చాలా కాలం పాటు బీజేపీలో పని చేశారు. గతంలో సనత్ నగర్ నియోజకవర్గం ఇంచార్జీగా కొనసాగారు. అలానే 2002 లో మొండా డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గా గెలుపొందారు. ది. 2018లో సనత్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వర్మ కి నలుగురు కుమార్తలు, ఒక కుమారుడున్నాడు.. ఇటీవల వర్మ చికిత్స పొందుతున్న సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ నాయకులు, మురళీధర్ రావు, తదితరులు వర్మ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చారు. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement