హైదరాబాద్ : చెక్క పని, గాజు, మెటీరియల్స్ పరిశ్రమల కోసం అధునాతన యంత్రాలు, సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అందించే ప్రముఖ సంస్థ బిస్సే ఇన్‌సైడ్ బిస్సే ఇండియా 2023ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ఈనెల 27, 28, 29 తేదీల్లో బెంగళూరులోని బిస్సే షోరూమ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో గోపాల్ ద్వివేది, ఇటలీలోని అటెలియర్ లాంపుగ్నేల్ మొరాండో నుండి గియుసేప్ మొరాండో, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ స్కిల్ కౌన్సిల్ నుండి రాహుల్ మెహతా, పెన్సరే నుండి రాఘవేంద్ర ఎన్‌కె సహా పలు పరిశ్రమల నుండి ప్రఖ్యాత వక్తలు పాల్గొంటారు.
ఈసందర్భంగా బిస్సే ఇండియా సీఈఓ సయీద్ అహ్మద్ మాట్లాడుతూ… ఇన్‌సైడ్ బిస్సే ఇండియా 2023ని నిర్వహించడానికి తాము చాలా ఆసక్తిగా ఉన్నామన్నారు. ఈ ఈవెంట్ చెక్క పని, గాజు, మెటీరియల్ పరిశ్రమలలోని నిపుణులకు ఉత్పత్తి పరిష్కారాల్లో తాజా పురోగతులను అన్వేషించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందన్నారు.