బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ తమ ప్రతిష్టాత్మక ఈవీ స్కూటర్ బీఐ సీ 12 (ఆఎ ఇ12)ను విడుదల చేసింది. డీ15, బీ8, ఏ2ల విజయాన్ని సీ 12 అనుసరిస్తుంది. సీ 12 విడుదల సందర్భంగా బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ కాబ్రా మాట్లాడుతూ.. ఫేమ్ సర్టిఫైడ్ వాహనం సీ12ఐ మ్యాక్స్ అన్నారు. పరిశ్రమలో మొట్టమొదటి తరహా ఫీచర్లు అయినటువంటి బూట్ స్పేస్‌ను ఇది కలిగి ఉందన్నారు. దీనిలో ఫుల్ ఫేస్ హెల్మెట్ భద్రపరచవచ్చన్నారు. కుటుంబానికి అనువుగా పొడవాటి, అత్యంత సౌకర్యవంతమైన సీట్ కలిగి ఉండటంతో పాటుగా ఏఆర్ఏఐ సర్టిఫికేషన్‌తో సంబంధం లేకుండా 143 కిలోమీటర్లు ప్రయాణిస్తుందన్నారు. వాటర్‌ఫ్రూఫ్ ఐపీ67 రేటెడ్ విద్యుత్ మోటర్, బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్లో 3.2 కిలోవాట్ హవర్–క్యాన్ ఎనేబల్డ్ లిథియం–అయాన్ బ్యాటరీ ఉంటుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement