కవాడిగూడ : అసెంబ్లీ, పార్లమెంట్ చట్టసభలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. త్వరలో వేలాది మందితో పార్లమెంట్ ముట్టడి జరపాలని నిర్ణయించినట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు. విద్యానగర్‌లోని బిసీ భవన్‌లో 33 బిసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా 56శాతం జనాభా గల బిసీలకు రాజ్యాధికారం కనీసం 15శాతం ప్రాతినిధ్యం లభించడం లేదని అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా బిసీల గురించి పట్టించుకోవడం లేదని విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బిసీలకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. బిసీలు కేవలం ఓట్లేసే యంత్రాలుగా మిగిలిపోయారని అవేదన వ్యక్తం చేశారు. ఒక్క శాతం జనాభా లేని వారు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యారని 56శాతం జనాభా గల బిసీలకు ఏ ఉన్నత పదవి దక్కకపోవడం ప్రజాస్వామ్యానికి సవాల్‌గా మారిందన్నారు. ఉద్యోగ రంగంలో కూడా బిసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో బిసీ సంఘాల నాయకులు నీల వెంకటేష్, సుధాకర్, రామూర్తి, చంద్రశేఖ ర్, చంటి, అనంతయ్య, నిఖిల్, ప్రభాకర్, భాస్కర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement