Friday, November 22, 2024

రైతుకు బ్యాంక‌ర్ల భ‌రోసా ఏది…!?

హైదరాబాద్‌, : ఏ ప్రభుత్వమైనా.. ప్ర భుత్వ రంగ బ్యాంకులైనా రైతు శ్రేయస్సే ప్రధాన అజెం డాగా ముందుకెళ్లాలి.. ఆ రకమైన లక్ష్యాలుంటేనే రైతు, రైతుతో పాటు వ్యవస్థ బాగుంటుంది. కానీ రైతులకు బ్యాంకులు ఇచ్చే రుణాలకు సంబంధించి స్కేల్‌ ఫైనాన్స్‌ విషయంలో మాత్రం బ్యాంకులు వివక్ష ధోరణిని అవ లంభిస్తున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులు రైతులకు ఇచ్చే రుణాలను స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్ల కమిటీ ఖరారు చేసింది. తాజాగా బ్యాంకర్ల కమిటీ రూపొందించిన రుణ పరిమి తులను పరిశీలిస్తే ఏ మాత్రం కూడా రైతులకు భరోసా నిచ్చేలా లేవని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.
బ్యాంకర్ల కమిటీ రూపొందించిన రుణపరిమి తుల ప్రకారం వరి సాగుకు రూ.45 వేల వరకు రుణమి వ్వాలని అధికారులు సూచిస్తే.. కమిటీ మాత్రం రూ.34 వేలకే దీన్ని పరిమితం చేసింది. పత్తికి రూ.53 వేలు ఇవ్వాలని సూచించగా రూ.35 నుంచి 38 వేలకు ఇవ్వనున్నట్టు తెలిపింది. మిర్చి పంటకు రూ.70 వేలు ఇచ్చేందుకు బ్యాంకర్ల కమిటీ నిర్ణయిం చింది. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ పంటకు రూ.57 వేలు ఇవ్వాలని అధికారులు సూచించగా.. రూ.38 వేలకే కమిటీ ఫైనల్‌ చేసింది. వీటితో పాటు మరికొన్ని పంటల కు అధికారులు సూచించిన దానికంటే కూడా తక్కవుగానే బ్యాంకర్ల కమిటీ రుణపరిమితులను ఖరారు చేసింది.
రైతుల పంటలకు రుణాలు ఇచ్చే అంశంపై బ్యాం కులు తీసుకునే నిర్ణయాల్లో రైతులను భాగస్వామ్యం చేయకపోవడం వలన క్షేత్రస్థాయిలో రైతులకు అవసర మైన స్థాయిలో బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదు. కనుక దీన్ని పరిగణలోకి తీసుకుని రుణపరిమితులపై తీసుకునే నిర్ణయాల్లో రైతులు, రైతు సంఘాలను భాగస్వామ్యం చేస్తే క్షేత్రస్థాయి రైతుల సమస్యలను కమిటీ ముందుంచడం ద్వారా అసలు రైతులకు లబ్ధి చేకూరుతుందని సంఘాల నేతల చెబుతున్నారు.
నాబార్డు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా..
జాతీయ బ్యాంకులన్నింటికి రైతులకు రుణా లు ఇచ్చేందుకు నాబార్డు ఫైనాన్స్‌ చేస్తుంటుంది. అయితే బ్యాంకర్ల కమిటీ నిర్ణయాల్లో నాబా ర్డు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తుందని, నాబార్డు ఈ అంశంపై బ్యాంక ర్లతో క్షేత్రస్థాయి పరిస్థితులను వారి దృష్టికి తీసుకెళ్లి రైతు లకు రుణపరిమితిని పెంచేలా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కమిటీకి సూచిస్తే ఖచ్చితంగా కమిటీ రుణ పరిమితిని పెంచేందుకు అవకాశా లున్నాయని సంఘా లు చెబుతున్నాయి. గతంలో రుణపరి మితులకు సంబంధించి జిల్లా కేంద్రాల్లోని డీసీసీ బ్యాంకులు రైతు సంఘాలను పిలిచి చర్చించేవని సంఘం నేత ఒకరు తెలిపారు. నాబార్డు నిర్లక్ష్యంగా వ్యవహరించండం తోనే బ్యాంకులు వ్యాపార ధోరణి లోనే రైతులను పరిగణిస్తున్నాయి తప్ప పూర్తిస్థా యిలో రైతులకు న్యాయం చేసేందుకు బ్యాంకులు చర్యలు తీసుకోవడం లేదని సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పెట్టుబడి వ్యయం పెరిగినా..
పెంచని రుణ పరిమితులు..
వ్యవసాయంలో రోజురోజుకి పెట్టుబడులు పెరుగుతున్నా.. బ్యాంకులు మాత్రం రుణపరిమితుల ను పెంచడం లేదని, ప్రస్తుత వ్యవసాయ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కమిటీ రుణానికి పరిమితులు ఖరారు చేయాల్సి ఉన్నా.. ఆ విధమైన చర్యలు లేవని తాజాగా బ్యాంకర్ల కమిటీ తీసుకున్న నిర్ణయాలతో అర్థమవుతోందని సంఘాలు చెబుతున్నాయి.

నిబంధనలు పాటించాలి
బ్యాంకులు రైతులకు ఇచ్చే రుణాల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనలు పాటిస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. బ్యాంకర్ల కమిటీ తాజాగా ఖరారు చేసిన రుణపరిమితులను ఖచ్చితంగా రైతుల కు అందించాలి. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని కమిటీ రుణపరిమి తులు ఖరారు చేయాలి. ఇప్పటికైనా రైతులకు అవసరమై న మేర రుణాలు అందించేలా బ్యాంకులు చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రభుత్వాలు కూడా దృష్టి సారించి.. రుణ పరిమితి పెరిగేలా చర్యలు తీసుకోవాలి. – టి. సాగర్‌, తెలంగాణ రైతు సంఘం, ప్రధాన కార్యదర్శి

Advertisement

తాజా వార్తలు

Advertisement