Friday, November 22, 2024

ఎమ్మెల్సీ ఫ‌లితారు మాకు స్పీడ్ బ్రేక‌ర్… బండి సంజ‌య్..

హైదరాబాద్‌, : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలూ కలిసి కట్టుగా పని చేశాయని, పోటీలో అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఓటమి మాకు స్పీడ్‌బ్రేకర్‌ లాంటిది స్పీడ్‌ బ్రేకర్‌ను దాటి వేగంగా వెళ్తామన్నారు. కేసీఆర్‌ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎంత అనేది ఈ ఎన్నికలు తేల్చాయన్నారు. టీఆర్‌ఎస్‌కు వచ్చింది కేవలం 30 శాతం ఓట్లేనని అంటూ 70 శాతం వ్యతిరేకంగా ఉన్నారని తేలిందన్నారు. మేం ముందే చెప్పాం కేసీఆర్‌కు నిద్ర లేకుండా చేస్తామని, ఈ ఎన్నికల్లో అదే జరిగిందన్నారు. ఫాంహౌజ్‌ను వదిలి ప్రగతి భవన్‌లో బస చేసిన సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం అందివచ్చిన అన్ని అడ్డదారులను తొక్కారన్నారు. కోట్ల రూపాయలను వెదజల్లారన్నారు. ఉద్యోగులను బెదరించారని, యూనియన్లను రద్దు చేస్తానని హెచ్చరించారన్నారు. విధిలేని పరిస్థితులలో ఉద్యోగులు టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారన్నారు. బీజేపీకి ఓటు వేసిన వారికి, వేయాలని అనుకున్నప్పటికీ విధి లేని పరిస్థితులలో వేయలేని వారికి ధన్యవాదాలన్నారు.దుబ్బాక తరహాలో సాగర్‌ ఎన్నిక ఫలితం ఉండబోతుందని సంజయ్‌ జోస్యం చెప్పారు. సాగర్‌ ఎన్నిక పార్టీ గుర్తుతో జరుగుతుందని, కమలం గుర్తు ప్రజల గుండెల్లో ఉందన్నారు. సాగర్‌ పోరులోనూ టీఆర్‌ఎస్‌ను నిద్రపోనివ్వమని, గెలుపు తమదే అని విశ్వాసం వ్యక్తం చేశారు. పేద ప్రజలు, అణగారిన వర్గాలు, గిరిజనులు బీజేపీ వైపు ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో కుంగిపోమని, మా టార్గెట్‌ 2023 ఎన్నికలన్నారు. ఏది ఏమైనా అసెంబ్లిd ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని, గోల్కొండ కోటపై కాషాయ జండాను ఎగురవేయడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement