Monday, November 25, 2024

HYD: బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి దాయకం.. ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

హైద‌రాబాద్ : బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి దాయకం, దళిత సమాజాభివృద్ధి కోసం వారు చేసిన సేవలు గొప్పవని అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్‌ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా, గొప్ప రాజకీయవేత్తగా, బాబూ జగ్జీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.


ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని.. బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి దాయకమని, దళిత సమాజాభివృద్ధికోసం వారు చేసిన సేవలు గొప్పవని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం తన జీవితకాలం పోరాటం చేసిన సంస్కరణ శీలిగా భారతదేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచివుండే గొప్ప దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉపప్రధాని పదవితో పాటు, పలు మంత్రిత్వ శాఖలు చేపట్టి ఆయా రంగాల్లో తనదైన ముద్రను, భారతదేశ పురోభివృద్ధికి పునాదులు వేసారని అన్నారు. దళితులు, వెనుకబడిన తరగతులు, అణచివేతకు గురైన వర్గాల ఉన్నతి కోసం, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు, కార్మికోద్యమాలను నడిపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగి రాములు, యాదగిరి, చిరంజీవి, దళిత సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement