బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళులని జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ అన్నారు. భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… దేశ సమగ్రతకు సమసమాజ స్థాపనకు ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. సమాజ సమానత్వం, సమాన హక్కుల కోసం ముందు చూపుతో రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. అంబేద్కర్ ప్రతిష్టలు భావితరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని, అందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో అంబేద్కర్ కీర్తి ప్రతిష్టలు మరింత పెంపొందించేలా ప్రపంచంలో మరి ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ తో పాటు ఈ.ఎన్.సి జియా ఉద్దీన్, సిసిపి దేవేందర్ రెడ్డి, ప్రాజెక్టు సి.ఇ దేవానంద్, హెచ్.ఆర్.డి.సి.యల్ సి.ఇ సరోజ దేవి, యస్ ఎన్ డి పీ సి ఇ కిషన్ అడిషనల్ కమిషనర్లు వి.కృష్ణ, సరోజ, విజయ లక్ష్మి, యాదగిరి రావు, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్, ఎకౌంట్స్ ఎగ్జామినర్ వెంకటేశ్వర రెడ్డి, సెక్రటరీ లక్ష్మి, సి.పీ.ఆర్.ఓ మొహమ్మద్ మూర్తుజా, హౌసింగ్ ఓ యస్ డి సురేష్, చీఫ్ ఏంటోమాలోజి రాజబాబు ఓ.ఎస్.డి అనురాధ, ఏ ఏమ్ సి లు వెంకట రమణ, జీవన్ కుమార్, తదితరులు మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.