Friday, October 18, 2024

HYD: 80వేల మంది భక్తులకే అయ్యప్ప దర్శనం సరికాదు..

స్పాట్ బుకింగ్ ని సైతం తిరిగి అమలులోకి తేవాలి..
భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలి.. బేతి తిరుమలరావు యాపాతిరుమల్..
కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ దేవస్థానం తీసుకున్న నిర్ణయం వల్ల కోట్లాది మంది అయ్యప్ప స్వామి భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని, 80వేల మంది భక్తులకే అయ్యప్ప దర్శనానికి గుర్తించడం సరికాదని బేతి తిరుమలరావు యాపాతిరుమల్ అన్నారు.

నవంబర్ 16 మొదలుకొని జ్యోతి అయ్యే వరకు దాదాపు మూడు నెలలకు పైగా రోజూ లక్ష మందికి పైగా అయ్యప్ప భక్తులు పదినిమిట్టాంబడి దర్శనానికి వెళుతుంటారని, అలాంటిది ఈసారి భక్తులకు ఇబ్బంది కలిగేలా కేవలం 80,000 మందికి దర్శనం కల్పిస్తామని, అలాగే స్పాట్ బుకింగ్ సైతం రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల స్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి భక్తులందరూ ఒక్కటై ప్రతిఘటిస్తారని మణికంఠ గ్రూప్ యాపాతిర్మల్ పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement