Friday, November 22, 2024

ఓటరు నమోదుపై అవగాహన ర్యాలీ .. విజయవంతంగా 5కె రన్

ఉప్పల్ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఓటర్ నమోదుపై వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఇవ్వాల‌ (శనివారం) 5 కే వన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసు, ఉప్పల్ సిఐ ఆర్.గోవిందరెడ్డి, ఎస్సైలు శంకర్ మధుసూదన్, నెహ్రూ, ఉప్పల్ శానిటేషన్ డిఇ చందన, ప్రాజెక్టు అధికారి రమాదేవి, శానిటేషన్ సూపర్వైజర్లు కే సుదర్శన్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉప్పల్ చౌరస్తా లో భారీ ఎత్తున ఓటు హక్కు పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసు, సిఐఆర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటింగ్ శాతం తక్కువగా జరుగుతుందని, ప్రజలు సరైన అభ్యర్థిని ఎన్నుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఓటరు జాబితాలో తమ పేరు చూసుకోవాలని కోరారు. కొత్తగా ఓటర్ నమోదు కూడా చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మండల రెవెన్యూ సూపర్డెంట్ అనంతరాములు, ఆర్ఐ సుధా ఉప్పల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దాసరి రఘురాములు, కాశిరెడ్డి, శ్రీహరి గౌడ్, సాయి వి.తిరుపతి రెడ్డి, వెంకటేశ్వర్లు బిక్షం రెడ్డి, పల్లూరు మహిళా సంఘం ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement