Tuesday, November 26, 2024

Mansion House : మాన్షన్‌ హౌస్‌ సింగిల్‌లో తనదైన మార్క్‌ సాహిత్యం జోడించిన అసుర

హైద‌రాబాద్ : ప్రమోద్‌ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ అసుర అంటే మాత్రం గుర్తుపట్టే వారెందరో ! తాను చూసిన జీవితాన్నే పాటగా మలిచి, ర్యాప్‌తో రఫ్పాడించే ప్రమోద్‌ శేషి రాయ్‌ వురఫ్‌ అసుర ఇప్పుడు మాన్షన్‌ హౌస్‌ రూపొందించిన ఓ వినూత్నమైన పాటతో అభిమానులను పలకరించాడు. తెలుగులో మొదటి ర్యాప్‌ ఆల్బమ్‌ విడుదల చేసిన అతను ఇప్పుడు వెల్కమ్‌ ద నౌ అంటూ మాన్షన్‌ హౌస్‌ సంస్థ రూపొందించిన సింగిల్‌లో తనదైన మార్క్‌ సాహిత్యం జోడించాడు. ఈ పాట అనుభవాలతో పాటుగా తన ప్రణాళికలను గురించి ఇలా చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ… వచ్చే వేసవిలో వైకుంఠ పాళి అని ఓ ఆల్బమ్‌ విడుదల చేయనున్నామన్నారు. తన జీవితంలో ఎదుగుదలకు తోడ్పడిన, పడగొట్టాలని చూసిన వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆల్బమ్‌ చేస్తున్నానన్నారు. మే నెలలో విడుదల చేయాలని ప్లాన్‌ చేశామన్నారు. దీని లిరిక్స్‌ అన్నీ నేనే రాసుకున్నానన్నారు. లైఫ్‌నే తన ఆల్బమ్‌లు రిలేట్‌ చేస్తుంటాయన్నారు.

గ్రాంధిక భాషలో రాయడం తనకు రాదని, తన జీవితంలో చోటు చేసుకున్న, తాను చూసిన సంఘటనలే తనకు స్ఫూర్తి అన్నారు. కాబట్టి తన పాటల్లో అది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. సినిమాల్లో కూడా పాడుతున్నానన్నారు. భోళా శంకర్‌లో రైజ్‌ భోళా అని ఓ ట్రాక్‌ పాడానన్నారు. 2019 నుంచే సినిమాల్లో పాడుతున్నానన్నారు. దగ్గర దగ్గర ఓ 11 పాటలు చేశానన్నారు. ఈ నెల 29న రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. రెండూ చిన్న సినిమాలే కానీ మంచివేన్నారు. ఈ పాటలలో తన లైఫ్‌ ఫిలాసఫీ ఉంటుందా అంటే సినిమాల సంగతి తెలిసిందేగా ! సినిమా కథకు దగ్గరలో ఉంటుందన్నారు. మాన్షన్‌ హౌస్‌ కంపెనీతో వర్క్‌ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు యువతరం, పాతతరంతో ఉన్న అనుబంధం నేపథ్యంలో అని చెప్పారు. వారి స్నేహం అనగానే విభిన్నం అనిపించిందన్నారు. ఆల్కహాల్‌ కంపెనీ అనగానే ఆల్కహాల్‌ గురించి రాయాలేమో అనుకున్నాను. కానీ వారి కాన్సెప్ట్ తనకు నచ్చిందన్నారు. తనదైన రీతిలో రాశానన్నారు. పెద్దవాళ్లతో స్నేహం ఉంటే వారి అనుభవం మనకు ఉపయోగపడుతుందన్నారు.

2014లో రాయడం ప్రారంభించానన్నారు. కానీ, యాక్టివ్‌గా మాత్రం 2019 నుంచి మొదలైందన్నారు. కొవిడ్‌ టైమ్‌లోని లైఫ్‌తో రాయడం ప్రారంభమా అంటే కాదు కానీ, కాలేజీలో ఉండగా మన విద్యావ్యవస్ధను చూసి రాశానన్నారు. నిజం చెప్పాలంటే తాను ఓ ఫెయిల్డ్‌ గ్రాడ్యుయేట్‌నన్నారు. తర్వాత సివిల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పొందానన్నారు. బెంగళూరులో చదివాను.. అక్కడ తాను రాయడం ప్రారంభించానన్నారు. భవిష్యత్‌ లో ఏంటి అని అంటే, రియాలిటీకి దూరంగానే ఉంటుంది, కానీ సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటి వరకూ మ్యూజిక్‌ అంటే సినిమాల్లో వస్తేనే పాట అని ఉందన్నారు. అలా కాకుండా ఇండివిడ్యువల్‌ ఆర్టిస్ట్‌లందరినీ ఒకేదరికి తీసుకువచ్చి ఐఎంపి (ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్‌) క్రియేట్‌ చేయాలనుకుంటున్నానన్నారు. రెండు సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తున్నానని, త్వరలోనే అది వాస్తవ రూపం దాలుస్తుందనుకుంటున్నానన్నారు. అలాగే భవిష్యత్‌లో దర్శకునిగా మారే ఆలోచన కూడా ఉందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement