Friday, November 22, 2024

ఆస్తి త‌గ‌దాలు, అక్ర‌మ సంబంధాలే హ‌త్య‌ల‌కు ప్రేర‌ణ‌లు…

హైదరాబాద్‌, : ఒకే కుటుంబానికి చెందిన వారైనా.. చిన్నతనం నుంచి కలిసి మెలిసి పెరి గిన వారైనా సరే.. చిన్న తగాదా ఇద్దరి మధ్య అగాధం పెంచేస్తోంది. అదే తీవ్రరూపు దాల్చి కక్షలకు కారణమై హత్యలకు దారి తీస్తోంది. మరోపక్క అనైతిక సంబం ధాల ఆరాటం.. ప్రాణాలు తీసేందుకు పురి కొల్పు తోం ది. భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల్లో తలెత్తే తగా దాలు.. ఎదుటి వారిని చంపేసేంతగా ప్రతీ కారాన్ని పెంచేస్తున్నాయి. పోలీసు శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2017-2019 మధ్య మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2,859 హత్య కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,660 (58.60 శాతం) ఘటనలకు వివాదాలు, వివాహేతర సంబంధాలే కారణాలుగా తేలింది. బాధి తులుగా మారుతున్న వారిలో ఎక్కువ మంది 18-30 ఏళ్ల వయసు వారున్నారు. దగ్గరి వారే 2017-19 మధ్య వివాదాల వల్ల 1,139 మంది హత్య లకు గుర య్యారు. కుటుంబ తగాదాలు, భూ వివా దాలు, నగదు లావా దేవీల్లో తలెత్తిన విభేదాలు, చిన్న చిన్న గొడవల్లో ప్రత్య ర్థులు వారిని హతమార్చారు. వీరిలో 492 మంది (43. 19 శాతం) కుటుంబ వివాదాల వల్లే హత్యలకు గుర య్యారు. పలు ఘటనల్లో హతులు, హంతకులు ఒక కుటుంబానికి చెందినవారు కావడం ఇక్కడ గమనిం చాల్సిన విషయం. ఆస్తి తగాదాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా సోదరుల మధ్య ఇలాంటి విభేదాలు అధికమని విశ్లేషిస్తున్నారు.అడ్డుగా ఉంటున్నారని.. వివాహేతర సంబంధా లవల్ల మూడేళ్లలో 521 మందిని చంపేశారు. ఏటా ఈ ఒక్క కారణంతో సగటున 17-18 శాతం హత్యలు జరు గుతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగిం చుకోవాలనే ఉద్దేశంతో కొందరు, తమ వైవాహిక జీవితంలోకి ప్రవేశించి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారనే కారణంతో మరికొందరు ఈ హత్యలకు పాల్పడుతున్నారు.
వివాహేతర సంబం ధాలు కొన సాగిస్తున్నారనే అనుమానం తోనూ ఇం కొంత మందిని చంపేస్తు న్నా రు. ఈ హత్యల్లో అంత మవుతున్న వారిలో ఎక్కువ మంది 18-30 ఏళ్లకు చెందినవారే ఉం టున్నారు. వావి వరుసలు మరిచి విచ్చలవిడి తనా నికి పాల్పడంతో ఘోరాలు జరుగు తున్నాయని పోలీ సులు పేర్కొంటు న్నారు. ఒక వ్యక్తి మరణించాడంటే అతడి మరణం సహజ మెందా? లేక మరేదైన కారణం ఉందా అన్న అను మానాలు తలెత్తుతున్నాయని, సహజ మరణమై న ప్పటికీ స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారిని విచారించాల్సిన వస్తోందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement