Tuesday, November 26, 2024

Assembly – బిఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉన్నంత కాలం సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ ఉండ‌దు …జగ‌దీష్ రెడ్డి

హైద‌రాబాద్ – ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంత కాలం సింగరేణిని ప్రైవేటీ కరణ కానివ్వ‌బోమ‌ని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మరో 20 ఏండ్లు బిబి ఆర్ యస్ పార్టీనే అధికారంలో ఉంటున్నందున సింగరేణికి పరుల పాలు కానివ్వబోమని ఆయన తేల్చిచెప్పారు. శనివారం రాష్ట్ర శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,బి ఆర్ యస్ కు చెందిన బాల్కా సుమన్,జువ్వాది దివాకర్ రావు,సండ్ర వెంకట వీరయ్య, గండ్ర వెంకట రమణా రెడ్డి తదితరులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ ఆర్ టి సి, విద్యుత్ శాఖా లను ప్రైవేలీ కరణను యావత్ భారతదేశంలో అడ్డుకున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని ఆయన చెప్పారు. సింగరేణిని ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకే 2005 లోనే అడుగులు పడ్డాయన్నారు.అప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయో నన్నారు.

కోల్ ఇండియా నిబంధనలు రూపుదిద్దుకుంది అక్కడి నుండే నన్నారు.అయితే సింగరేణి ఘనులను వేలం వేసే హక్కులు ఏ ఒక్కరికి లేవన్నారు.ఆ ప్రాంతంలో ఉన్న నిక్షేపాలపైనే ఈ చట్టాలు అన్నారు.అది కూడా స్థానికులకే ఇవ్వాలి అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. కొత్తగా వచ్చిన చట్టాలు ఆ ప్రాంతంలో ఉన్న నిక్షేపాలమీద నన్నారు.2015 లో ఓపెన్ కాస్టులను బహిరంగ వేలం వేయాలన్న చట్టాన్ని కేంద్రం రూపొందించిందన్నారు. ఇది గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి 2021 జులై నెలలో లేఖ రాస్తూ ఇందులో ప్రధాని జోక్యం చేసుకోవాలని చేసిన విజ్ఞప్తిని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. 1974 లో దైపాక్షిక ఒప్పందంలో బాగంగా యస్ సి సి ఎల్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఆ ప్రాంతం పై సింగ‌రేణికి మాత్రమే హక్కులు ఉన్నాయన్నారు.

1957 17(A2)రిజర్వేషన్ ప్రకారం ఓపెన్ యాక్షన్ జరిగినా అది స్థానికులకే హక్కులుంటాయాన్నారు. 11(A)ప్రకారము కేటాయింపులు కుడా జరుపుకోవచ్చన్న నిబంధన ఉందన్నారు.సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రైవేటు సంస్థలలో పని చేసే వారిని క్రమబద్దీకరించడం సాధ్యం కాదన్నారు. అయితే భూములు కొల్పోయిన వారికి ఉపాధి కల్పించడం కోసం వారి అర్హతలకు తగిన ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు.
యావత్ భారతదేశానికే సింగరేణి తల మానికాంగ నిలిచిందన్నారు.ఉద్యోగస్థూలకు లాభాలలో వాటా ఇచ్చి నడుపుతున్న ఏకైక సంస్థ అన్నారు. అటువంటి సంస్థను ప్రవైటీకరించేందుకు 2005 లో నాటి కాంగ్రెస్ బీజం వేస్తే 2015 లో మోడీ సర్కార్ అందుకు కొనసాగింపుగా చట్టాలు తీసుకొచ్చిందన్నారు విద్యుత్ చట్టాలు,మినరల్ డెవలప్మెంట్ చట్టాలు,కోల్ ఇండియా చట్టాలు అందులో బాగామే నన్నారు.ఆర్&ఆర్ ప్యాకేజి పై ఎటువంటి అపోహలు వలదన్నారు.ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్ల వద్దకు ఆ నిధులు చేరుకున్నాయాన్నారు.న్యాయపరమైన సమస్యలు ఉన్నందునే కొంత జాప్యం జరుగుతోందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం సింగరేణిని ప్రవైటీ కరణ జరగనివ్వబోమని గౌరవ సభ్యులు, సింగరేణి ఉద్యోగులు ఆయా ప్రాంతాల ప్రజలు ఎటువంటి బయన్దోళనలకు గురి కావొద్దన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement