హైదరాబాద్ : హైదరాబాద్‌లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాల గ్రాడ్యుయేట్ అయిన అశ్రిత లోకసాని ఈ సంవత్సరం డెలివరూస్ ఐడిసిలో ఇంటర్న్ చేశారు. ఈ ఇంటర్న్‌షిప్ విలువైన సాంకేతిక అనుభవాన్ని అందించింది. ఈసందర్భంగా డెలివరూ ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంటర్న్ గా తన ప్రయాణాన్ని ఆశ్రిత లోకసాని పంచుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా మారడానికి గల తన ప్రేరణ గురించి ఆశ్రిత మాట్లాడుతూ… కంప్యూటర్ సామర్థ్యాలను అన్వేషించేటప్పుడు తాను అనుభవించిన ఆనందం, ఆకర్షణ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌పై తన మక్కువను పెంచిందన్నారు. తన సహజసిద్ధమైన సమస్య పరిష్కార నైపుణ్యాలతో కలిపి, ఈ ఎర్లీ ఎక్సపోసర్ తనకు ఇంజనీరింగ్‌లో కెరీర్‌ను నిర్మించే మార్గం తెలిపిందన్నారు. ఎస్టీఈఎం ఫీల్డ్‌లలో మహిళల కొరతను వెల్లడిస్తూ, విజయవంతమైన మహిళా రోల్ మోడల్లను ప్రదర్శించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతులు పెద్ద కలలు కనేలా, ఎస్టీఈఎం లో కెరీర్‌ను కొనసాగించేలా ప్రేరేపించగలదని ఆశ్రిత అభిప్రాయపడ్డారు.
ఇంజనీరింగ్ పరిశ్రమలో కెరీర్ కోరుకునే యువ నిపుణులకు సలహానిస్తున్న అశ్రిత భవిష్యత్ ఇంటర్న్లు అవకాశాల నుండి దూరంగా ఉండకూడదు, హ్యాకథాన్ల వంటి ఈవెంట్లలో చురుకుగా పాల్గొనాలి. ఉద్యోగుల వనరుల సమూహాలలో భాగం కావాలి. అలాగే, ఆసక్తి కనబరచాలి, ప్రశ్నించాలని అన్నారు. డెలివరూలో సహాయక వాతావరణాన్ని అభినందించిన ఆమె, ఇక్కడ వీపీల వంటి ఉన్నత స్థాయి అధికారులు కూడా సందేహాలు, ప్రశ్నలను పరిష్కరిస్తారన్నారు. తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణంతో, ఇంజనీరింగ్ రంగంలో మహిళలు చూపే అపారమైన సామర్థ్యానికి, విజయానికి నిదర్శనంగా ఆశ్రిత లోకసాని నిలుస్తారన్నారు.