హైదరాబాద్, ఆంధ్రప్రభ : మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ నగర రోడ్లపై ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మొదటి దశలో 25 బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. గతంలో తిరిగిన డబుల్ డెక్కర్ బస్సులతో పోల్చితే సాంకేతికపరంగా మంచి సామ ర్థ్యమున్న ఇంజిన్, హైదరాబాద్ రోడ్లకు అనువైన బస్సుబాడీ వంటివి ఉండేలా టెండర్లను ఆహ్వా నించింది. బస్సు తయారీలో కచ్చితమైన ప్రమాణాలు పాటించాలని టెండరు దాఖలు చేసే సమ యంలోనే ఆర్టీసీ స్పష్టంచేసింది. ఇటీవల దాఖలైన టెండర్లలో అశోక్ లేల్యాండ్ సంస్థ ఒక్కటే పాల్గొంది. ఆర్టీసీ కోరిన విధంగా బస్సులను బాడీతో సహా సమ కూర్చి ఇస్తామని అశోక్ లేల్యాండ్ తెలిపింది. మొద టి దశలో 25 బస్సులు కావాలని ఆర్టీసీ కోరగా అందిస్తామని టెండరు దాఖలు చేసిన సంస్థ వెల్లడిం చింది. మరో రెండు రోజుల్లో ఆర్థిక కమిటీ బస్సుల ధరపై చర్చించి, ఆమోదముద్ర వేస్తే డబుల్ డెక్కర్ బస్సులొచ్చేస్తాయ్.
డబుల్ డెక్కర్ కు అశోక్ లేల్యాండ్ టెండర్..
Advertisement
తాజా వార్తలు
Advertisement