ఎంఐఎం ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. 1948 జూన్ 15న ఇచ్చిన రాజ్యాంగ బద్దమైన ఒక డ్రాఫ్ట్ ను ఉస్మాన్ అలీ ఖాన్ ఆమోదించి ఉండాల్సిందని అన్నారు. ఆ డ్రాఫ్ట్ ను నిజాం ఆమోదించి ఉంటే తెలంగాణలో పోలీస్ యాక్షన్ జరిగి ఉండేది కాదన్నారు. కశ్మీరీలకు ఇచ్చిన ఆర్టికల్ 370 కన్నా ఎక్కువ లాభాలను పొందే అవకాశాన్ని నిజాం చేజార్చారని అన్నారు. 7వ నిజాంను ఒవైసీ తొలిసారి తప్పుపట్టారు. నిజాం ఆనాడు ఎంతో అహంకారాన్ని ప్రదర్శించారని చెప్పారు. మరోవైపు, లార్డ్ మౌంట్ బాటన్, ఖాసీం రిజ్వీ ఇద్దరూ నిజాంను మోసం చేశారని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement