గత ఏడు సంవత్సరాలుగా ఏరియల్ ఇండియా నిరంతరాయంగా ఇంటి పనుల విభజనలో అసమానతలను గురించి చర్చను తీసుకువస్తూనే మరింత మంది మగవారు షేర్ ద లోడ్ చేయాలని కోరుతుంది. ఇంటిలోపల సమానత్వం మరింతగా మెరుగుపరిచేందుకు ఏరియల్ ఇప్పుడు ‘సీ ఈక్వెల్’ అంటూ ప్రచార చిత్రం విడుదల చేసింది. దానితో పాటుగా ‘షేర్ద లోడ్ ’ప్రచారపు 5వ ఎడిషన్‌ను సైతం ప్రారంభించింది. ఈ సందర్భంగా నటి జెనీలియా మాట్లాడుతూ… ఇంటి పనుల్లో భార్యకు సహాయపడని వారు తమ భార్యను తమతో సమానంగా భావిస్తున్నారని చెప్పలేమని ఈ చిత్ర ఆవిష్కరణ సందర్భంలో నటి జెనీలియా అన్నారు. ఏరియల్ సంస్థ నిర్వహిస్తున్న షేర్ ద లోడ్ ప్రచారం 5వ ఎడిషన్ ప్రారంభించడానికి రితేష్ దేశ్ముఖ్తో కలిసి ప్రత్యేకంగా హాజరయ్యారామె.
వర్ట్యువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో మగవారితో సమానంగా మహిళలనూ చూడండి అంటూ చెప్పిన జెనీలియా తన వరకూ మాత్రం ఈ విషయంలో అదృష్టవంతురాలినేనన్నారు. లాక్డౌన్ సమయం అనేకాదు ఇతర సమయాల్లో కూడా రితేష్ తనకు ఇంటి పనుల్లో సహాయపడతాడని చెప్పిన ఆమె చాలామంది మగవారికి ఇంటి పనులు ఎలా చేయాలో తెలుసన్నారు. మీరు మీ భార్యను ప్రేమిస్తే ఆమెను సమానంగా చూడాల్సిన అవసరముందన్నారు. గృహంలో సమానత్వం కోసం ఏరియల్ లాంటి బ్రాండ్లు కృషి చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు. రితేష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ… షేర్ ద లోడ్ సీ ఈక్వెల్ ప్రచార చిత్రం చూసిన వెంటనే యుఎస్‌లో తాను చదువుకున్న రోజులు గుర్తొచ్చాయన్నారు. అప్నట్లో తన స్నేహితునితో కలిసి ఇంటి పనులు పంచుకోవడం జరిగిందంటూ జెనీలియాకు స్నేహితునిగా ఉన్నప్పుడు ఎలాగున్నానో ఇప్పటికీ అలాగే ఉన్నానన్నారు. ఆమెకు వీలైనంత వరకూ తోడ్పడుతూనే ఉంటానన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital