టీఆర్ఎస్ పార్టీ వారు ధర్నాలు ఎందుకు చేస్తున్నారని, హుజూరాబాద్ రైతుల మీద ధర్నాలు చేస్తున్నారా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… హుజూరాబాద్ ఫలితానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారా అని అన్నారు. కేంద్రం రైతు వ్యతిరేకి అనేందుకు నోరు ఎలా వస్తోందని అన్నారు. అబద్దాల సామ్రాజ్యంపై ప్రభుత్వాలను నడపకండి అని అన్నారు. తాము ఎక్కడా అప్పులు చేసి కమీషన్లు తీసుకోలేదన్నారు. ధర్నా చౌక్ వద్దన్నవాళ్లే.. అక్కడ ధర్నాలు చేస్తున్నారన్నారు. దళిత బంధు ఇస్తామన్న ప్రభుత్వానికి.. దళిత బంధే కాదు.. బీసీ, గిరిజన, మైనార్టీ బంధు రావాలని కోరుతున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement