Friday, November 22, 2024

ఏపీజీబీ-బజాజ్‌ అలియాన్జ్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్ భాగస్వామ్యం

బజాజ్‌ అలియాన్జ్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్ రాష్ట్రంలో ఖాతాదారులను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌ అయిన ఆంద్రప్రదేశ్‌ ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ) భాగస్వామ్యం చేసుకున్నాయి. బజాజ్‌ అలియాన్జ్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ పథకాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 500 కంటే ఎక్కువ శాఖల్లో 3 సంవత్సరాల వ్యవధికి ఒక కార్పొరేట్‌ ఏజెన్సీ ఒప్పందాన్ని ప్రకటించాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రజానీకానికి తమ ఈ వర్గంలో అత్యుత్తమమైన పథకాలను, సేవలను అందజేయడం ద్వారా వారికి చేరుకోవాలని ఈ భాగసామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ భాగస్వామ్యంపై ఆంద్రప్రదేశ్‌ ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఛైర్మన్ రాకేషన్‌ కాశ్యప్ మాట్లాడుతూ.. బజాజ్ తో తమ భాగస్వామ్యం గురించి తాము ఆనందంగా ఉన్నామన్నారు. ఉద్వేగభరితయ్యామన్నారు. ఈ భాగస్వామ్యం ఎంతో సుదూరతీరాలకు వెళుతుందని తాను ఆశిస్తున్నానన్నారు. భాగస్వాములు ఇద్దరూ ఈ వ్యాపారంలో చక్కటి అనుభవాన్ని పొందగలరన్నారు. బజాజ్‌ అలియాన్జ్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్ జియో డిస్ట్రిబ్యూషన్ హెడ్ రోహిత్ జైన్ మాట్లాడుతూ… బీమా చాలా కీలకమైన అంశమన్నారు. ఇది అనిశ్చితమైన అత్యవసర సమయాల్లో ఆర్ధికంగా ఉపశమనాన్నిఅందజేస్తుందన్నారు. బలమైన వితరణ, ఆర్ధిక సంస్థలతో దృఢమైన భాగస్వామ్యాలు, దూరతీరాల్లో ఉన్న ఖాతాదారులను చేరుకోవడంలో సహాయపడడానికి వీలుగా, వారి అవసరాలకు తగ్గట్లుగా ఉన్న పథకాలను వారికి అందజూపడం తమకు అవసరమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement