Sunday, November 17, 2024

HYD: గ్రిసెల్లి సిండ్రోమ్‌తో బాధపడుతున్న చిన్నారిని రక్షించిన ఏఓఐ హెమటాలజీ వైద్యులు

హైదరాబాద్ : గ్రిసెల్లి సిండ్రోమ్ (జీఎస్)తో బాధపడుతున్న 14నెలల చిన్నారికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎంటీ) విజయవంతంగా నిర్వహించటం ద్వారా హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌ వద్దనున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ) ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. కన్సల్టెంట్‌ పీడియాట్రిక్‌ హెమటో ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ సి.ఎస్‌.రంజిత్‌ కుమార్‌ నేతృత్వంలో సాధించిన ఈ విజయం, సంక్లిష్టమైన పీడియాట్రిక్‌ కేసులకు చికిత్సనందించటంలో ఏఓఐ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ) రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పి.మాట్లాడుతూ… భారత్‌లో బీఎంటీని కోరుకునే రోగుల సంఖ్య గత ఐదేళ్లలో పెరిగిందన్నారు. పీడియాట్రిక్ బీఎంటీ ఫలితాలు కూడా మెరుగు పడుతున్నాయన్నారు.

ఏఓఐ దక్షిణాసియాలోని త‌మ రోగులకు అత్యుత్తమ క్లినికల్ నైపుణ్యం, మెరుగైన సాంకేతిక, సేవా శ్రేష్ఠతను అందించడానికి కట్టుబడి ఉందన్నారు. ఏఓఐ అన్ని వయసుల వారికి సంబంధించిన అన్నిరకాల క్యాన్సర్‌లకు ఖచ్చితమైన క్యాన్సర్ కేర్‌ను అందించే చికిత్సా నైపుణ్యంతో ముందంజలో ఉందన్నారు. రోగి తీవ్రమైన పరిస్థితిని డాక్టర్ సీఎస్ రంజిత్ కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ హేమాటో ఆంకాలజిస్ట్, ఏఓఐ వివరిస్తూ… బిఎమ్‌టి చికిత్సకు వెళ్లే ప్రాథమిక రోగనిరోధక లోపం ఉన్న పిల్లల్లో మార్పిడికి సంబంధించిన మరణాలు ప్రధాన సవాలుగా నిలుస్తున్నాయన్నారు. విజయవంతమైన ఫలితాల కోసం చికిత్స చేసే శిశువైద్యుడు ఈ లక్షణాలను ముందుగానే గుర్తించాలన్నారు. పీఐడీ కోసం బీఎంటీలో భారతదేశం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. భవిష్యత్తులో మనం ముందుగానే రోగనిర్ధారణ చేసి మార్పిడి చేయగలగడం ద్వారా మెరుగైన జీవన నాణ్యతతో ఎక్కువ మంది జీవితాలను రక్షించగలమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement