Friday, November 22, 2024

అనాప్లాస్టిక్ ఎపెండిమోమాతో బాధ పడుతున్న 3ఏళ్ల చిన్నారికి చికిత్స విజయవంతం చేసిన గుంటూరులోని AOI

విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (AOI) గుంటూరులో గ్రేడ్ 3 CNS ట్యూమర్ అయిన అనాప్లాస్టిక్ ఎపెండిమోమాతో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి విజయవంతంగా చికిత్స అందించింది. కేంద్ర నాడీ వ్యవస్థను అనాప్లాస్టిక్ ఎపెండిమోమా ప్రభావితం చేస్తుంది. తలనొప్పి, వికారం, వాంతులు, అవయవాల బలహీనత వంటి లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. మెదడు, వెన్నుపాము లోపల సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (CSF) సంతులనం, ప్రసరణపై ప్రభావితం చేసే రీతిలో ఈ కణితి ఉందని గుర్తించారు.

AOI లోని కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, డాక్టర్ కె.సుధాకర్ నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం, డాక్టర్ సాయి బాబు, అనస్థీషియాలజీ మద్దతుతో, GGHలో ఎక్సిషన్ సర్జరీ నిర్వహించారు. హిస్టోపాథాలజీ ఎగ్జామినేషన్ (HPE) అనాప్లాస్టిక్ ఎపెండిమోమా గ్రేడ్ 3 ను నిర్ధారించింది. శస్త్రచికిత్స తర్వాత, మరొక సారి చేసిన మెదడు స్కాన్ తో ఈ కణితి ఏర్పడిన అసాధారణ ప్రాంతం చాలా వరకూ కుంచించుకుపోయిందని చూపించింది.

ఈసందర్భంగా AOI వద్ద కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె. సుధాకర్ మాట్లాడుతూ… అనాప్లాస్టిక్ ఎపెండిమోమాతో బాధపడుతున్న ఈ చిన్నారికి హాల్సియోన్ లీనియర్ యాక్సిలరేటర్ వంటి అధునాతన సాంకేతికతలతో విజయవంతమైన చికిత్స ను ఖచ్చితమైన, అనుకూలమైన రేడియేషన్ థెరపీని అందించడంలో వాటి ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుందన్నారు. క్లిష్టమైన అవయవాలు రేడియేషన్ ప్రభావానికి గురికావడాన్ని తగ్గించడం, చికిత్స తర్వాత మెరుగైన జీవన నాణ్యతను అందించడం ద్వారా న్యూరోకాగ్నిటివ్, అభివృద్ధి పరంగా అవాంతరాల ప్రమాదాన్ని తగ్గించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. AOI రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (RCOO) మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో తాము అసమానమైన రీతిలో చికిత్సను అందించడానికి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన వైద్య నిపుణుల బృందంపై ఆధారపడుతున్నామన్నారు. ఈ చిన్నారికి విజయవంతమైన చికిత్స సానుకూల రోగి ఫలితాలను సాధించడంలో, సవాలుతో కూడిన కేసులను ఎదుర్కోవడం పరంగా పురోగతి సాధించడంలో తమ నిబద్ధతను సూచిస్తుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement