Friday, November 22, 2024

హెచ్ డీఆర్ ఇంటర్‌స్టీషియల్ బ్రాచిథెరపీపై వర్క్‌షాప్ నిర్వహించిన ఏఓఐ

హైదరాబాద్ : దక్షిణాసియాలోని అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ చైన్‌లలో ఒకటైన అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ) హైదరాబాద్‌లోని ఏఓఐ లో ఎంఆర్ ఆధారిత హెచ్ డీఆర్ ఇంటర్‌స్టీషియల్ బ్రాచిథెరపీపై వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌పై డాక్టర్ సుశీల్ బెరివాల్ మాట్లాడుతూ… కేన్సర్ కణాలను చంపడానికి రేడియేషన్ థెరపీ ఒక మార్గమన్నారు. రేడియేషన్ బయట నుండి లేదా శరీరం లోపల నుండి ఇవ్వవచ్చన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స కోసం ఇంటర్‌స్టీషియల్ బ్రాచిథెరపీలో, రేడియేషన్ సరిగ్గా ప్రోస్టేట్ గ్రంధిలోకి ప్రవేశపెడతారన్నారు. ఈ రకమైన చికిత్స ప్రయోజనం ఏమిటంటే రేడియేషన్ ఒక చిన్న ప్రాంతానికి పరిమితం చేయబడిందన్నారు. ఇది మీ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేయదన్నారు.

ఏఓఐ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ బ్రాచిథెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ హర్జోత్ కౌర్ బజ్వా మాట్లాడుతూ… కార్సినోమా ప్రోస్టేట్ కోసం ఎంఆర్ బేస్డ్ హెచ్ డీఆర్ ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని హైదరాబాద్‌లోని ఏఓఐ లో రెండు రాష్ట్రాల్లో మొదటిసారిగా నిర్వహించడం జరిగిందన్నారు. బాహ్య రేడియోథెరపీతో పోలిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ రోగుల్లో ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తుందన్నారు. రీజనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఏఓఐ డాక్టర్ ప్రభాకర్ పి మాట్లాడుతూ… ఎంఆర్ ఆధారిత హెచ్ డీఆర్ ఇంటర్‌స్టీషియల్ బ్రాచిథెరపీ వర్క్‌షాప్ అద్భుతమైన విజయం, భాగస్వామ్య ఆవిష్కరణను పెంపొందించడంలో త‌మ దృఢ నిబద్ధతకు నిదర్శనమ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement