Wednesday, September 18, 2024

HYD: అక్టోబర్ 20 నుండి అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాదం..

మాలధారణ, పడిపూజలు ప్రారంభం
సర్వాంగ సుందరంగ ముస్తాబైన దేవాలయం

కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ లోని శ్రీనివాస్ నగర్ లో కొలువైన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అక్టోబర్ 20 నుండి డిసెంబర్ 20 వరకు నిత్య అన్నదానం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్ప మాలధారణ, పడిపూజలు, స్వామివారి కైంకర్యాల సేవల నిమిత్తమై ఆలయ ప్రాంగణంలో మంగళవారం దేవాలయ కమిటీ సమావేశమైంది. ఆలయ చైర్మన్ కొలను చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ వైస్ చైర్మన్ శనిగల ధన్ రాజ్ యాదవ్, ప్రధాన అర్చకులు నాగార్జున ఆచార్యుల ఆధ్వర్యంలో కమిటీ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు.

అక్టోబర్ 20నుండి డిసెంబర్ 20 వరకు దేవాలయ ప్రాంగణంలో నిత్యాన్నదానం నిర్వహించబడునని స్పష్టం చేశారు. అయ్యప్ప భక్తుల మాలధారణ వారి రాకను బట్టి అన్నదాన కార్యక్రమం పొడిగించబడునని ఆలయ కమిటీ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాఘవేందర్ రావు, ఆలయ ట్రెజరర్ ఉంగరాల శ్రీనివాస్ రావు, గురు స్వామి ఇంద్ర కుమార్ దేవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ హరిబాబు , జాయింట్ సెక్రటరీ సతీష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -


పడిపూజ, అన్నదానం కోసం సంప్రదించండి..
అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో కార్తీకమాస మండల పూజను పురస్కరించుకొని నిర్వహించే పడిపూజ, అన్నదానం, స్వామి వారి కైంకర్యాలు, ఇతరత్రా సేవల కోసం సంప్రదించాలని ఆలయ ప్రధాన పూజారులు నాగార్జున ఆచార్యులు కోరారు.


సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం…
ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్ప మాలధారణ, పడిపూజలు, ఇతరత్రా ప్రత్యేక పూజలు నిమిత్తమై అయ్యప్ప స్వామి దేవాలయం సర్వంగ సిద్ధనంగా సిద్ధమైంది. రెండు సంవత్సరాల క్రితం వేద పండితుల ఆశీర్వచనాలు, ప్రత్యేక ప్రతిష్ట, హోమాలతో ప్రారంభమైన అయ్యప్ప స్వామి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది.

అయ్యప్ప భక్తుల రాక, మాలధారణ సైతం సైతం గత రెండు సంవత్సరాల్లో గణనీయంగా పెరిగింది. అయ్యప్ప భక్తుల కోసం సకల సౌకర్యాలను దేవాలయ కమిటీ కల్పించింది. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే దేవాలయానికి పెయింటింగ్ పూర్తి కావడంతో ఆలయం నూతన శోభతో కళకళలాడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement