హైదరాబాద్ నగరంలోని అమీర్ పెట్ మధురానగర్ లోని అమ్మ యోగాశ్రమం భవనంలో అధ్యక్షురాలు నన్నక సీత అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు..యోగా చేయడానికి వచ్చిన వారిలో దాగి ఉన్న ప్రతిభ బయటకు తీయడం కోసం వివిధ రకాల పోటీలు పెట్టారు.. అందులో విజేతలను ఘనంగా సన్మానించారు.. వివిధ రంగాలలో కృషి చేస్తున్న వారిని గుర్తించి ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు.. శాలువా, ప్రశంశా పత్రం అందించారు..అనంతరం నన్నక సీత మాట్లాడుతూ.. నా చిన్న తనం నుంచే యోగ చేయడం అలవాటు అన్నారు ..వాటి వల్ల ఉండే ఉపయోగాలను అందరిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యోగ టీచర్ ప్రస్థానాన్ని ప్రారంభించి .. ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రజల్లో చైతన్యం పెంచుతూ.. సామాజిక సేవలో ముందుకు పోతున్నానన్నారు. టాలెంట్ ఉన్న వారికీ తన సహాయం ఎప్పటికి ఉంటుందని నన్నక సీత అన్నారు ఈ కార్యక్రమంలో, యాక్టర్స్, లీడర్స్, మోడల్స్, సామాజిక సేవకులు తదితరులు పాల్గొన్నారు.
అమ్మ యోగాశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో -యోగ డే సెలెబ్రేషన్ -టాలెంట్ ఉన్నావారికి సాయమందిస్తాం- నన్నక సీత
Advertisement
తాజా వార్తలు
Advertisement