కవాడిగూడ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గొప్ప ఆలోచన పరుడని న్యాయవాదుల జేఏసి రాష్ట్ర కన్వీనర్ పులిగారి గోవర్దన్‌రెడ్డి కొనియాడారు. ఆయన ఆలోచన విధానాలే ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ భవన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో పేదరిక నిర్మూలన కోసం అంబేద్కర్ ఆలోచన విధానాలు ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు సమాజంలో సమాన హక్కులు కల్పించే విధంగా అంబేద్కర్ ఆనాడే ఆలోచించి రాజ్యాంగాన్ని నిర్మించారని వెల్లడించారు. అందరికీ సమాన హోదా, హక్కులు ఉండాలనే ఆలోచన, ముందు చూపు వల్లే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆయన అందించిన ఫలాలు దక్కుతున్నాయన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement