2020తో పోలిస్తే భారతీయ వినియోగదారులు 2021లో అలెక్సాతో 68శాతం అధికంగా సంభాషించారు. అమెజాన్ ఎకో, ఫైర్ టీవీ, అలెక్సా బిల్ట్ ఇన్ ఉపకరణాలపై 50శాతం వరకూ రాయితీని అమెజాన్ ప్రకటించింది. ఈసందర్భంగా అమెజాన్ ఇండియా అలెక్సా కంట్రీ లీడర్ పునీష్ కుమార్ మాట్లాడుతూ…. అలెక్సాను మరింత ఉపయుక్తంగా, ఆహ్లాదకరంగా భారతదేశంలోని వినియోగదారులకు తీర్చిదిద్దేందుకు తాము నిరంతరం శ్రమిస్తూనే ఉన్నామన్నారు. దీనిలో భాగంగా అత్యాధునిక ఎకో షో 10ను ఇంటిలిజెంట్ మోషన్‌తో ఆవిష్కరించడం జరిగిందన్నారు. భారతదేశపు మొట్టమొదటి సెలబ్రిటీ వాయిస్‌ను అమితాబ్ బచ్చన్‌తో పరిచయం చేయడం, మహీంద్రా ఎక్స్‌యువీ 700 వాహనాన్ని అలెక్సా బిల్ట్ ఇన్‌తో తీర్చిదిద్దడం వంటివి ఉన్నాయన్నారు. చాలా మంది వినియోగదారులు అందించిన అభిప్రాయాల ప్రకారం అలెక్సా వారి చుట్టూ ఉంటే వారి జీవితం మరింత వినోదాత్మకంగా, ఉత్పాదకతతో కూడిన రీతిలో మారుతుందన్నారు. ఈ ప్రోత్సాహమే తమను మరింతగా ఆవిష్కరించేందుకు, తొలి రోజు ఏ విధంగా అయితే ఉత్సాహంతో పనిచేస్తామో అదే రీతిలో పనిచేసేందుకు తోడ్పడుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital