మదర్స్ డే వేళ ఆదర్శవంతమైన బహుమతిగా బాదం నిలుస్తుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడే సామర్థ్యం దీనిలో ఉంది. దీనితో పాటు బాదం, మధుమేహం, బరువు నిర్వహణ నుండి చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం వరకు ఇతర ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది. ఈసందర్భంగా న్యూట్రిషన్ – వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… తమ కుటుంబాల సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చే తల్లులు తరచుగా తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరన్నారు. అందువల్ల, బాదం వంటి సులభమైన, పోషకమైన ఆహారాలను వారి ఆహారంలో చేర్చడం చాలా ముఖ్యమన్నారు. బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హానికరమైన ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని, ఆరోగ్యకరమైన ఆహారంతో కలిపి రక్షిత హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయన్నారు.
ప్రఖ్యాత భారతీయ టెలివిజన్ అండ్ చలనచిత్ర నటి నిషా గణేష్ మాట్లాడుతూ… తల్లిగా మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా అవసరమన్నారు. తన చిన్నతనంలో తాను ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పులను తినాలని అమ్మ ఎప్పుడూ ఒక పనిగా పెట్టుకునేదన్నారు. ఒక తల్లిగా, తాను ఈ అలవాటును అలవర్చుకున్నానన్నారు. సుప్రసిద్ధ దక్షిణ భారత నటి ప్రణీత సుభాష్ మాట్లాడుతూ… తన పాఠశాల విద్య, కెరీర్‌లో తమ అమ్మ తనకు తిరుగులేని మద్దతు వ్యవస్థగా ఉందని, ఆమె నిస్వార్థ త్యాగాలు తనను ఈ రోజు వ్యక్తిగా తీర్చిదిద్దాయన్నారు. ఆమె రోజువారీ ఆహారంలో కొన్ని బాదంపప్పులను చేర్చడం ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక మార్గమన్నారు. కాస్మోటాలజిస్ట్, స్కిన్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా మాట్లాడుతూ… చర్మ సంరక్షణలో స్థిరత్వం కీలకమన్నారు. ఆరోగ్యకరంగా కనిపించే చర్మానికి సులభమైన, ప్రాథమిక దశ అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో కూడిన పోషకమైన ఆహారాన్ని నిర్వహించడం ముఖ్యమన్నారు. బాదం వంటి గింజలను తీసుకోవడం చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు.