Thursday, November 21, 2024

డయాబెటీస్‌ రోగుల్లో బాదములతో బ్లడ్ షుగర్ స్థాయి మెరుగు

భోజనాలకు ముందు బాదములు తినడం వల్ల ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న కొంతమంది రోగుల్లో బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడ్డాయి. బాదములపై చేసిన రెండు నూతన అధ్యయనాలు, ఒక అధ్యయనాన్ని మూడు రోజుల పాటు చేయగా, మరో అధ్యయనాన్ని మూడు నెలల పాటు నిర్వహించగా, అవి బాదముల వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించాయి. ఈసంద‌ర్భంగా ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన మెటబాలిక్‌ డిసీజెస్‌, ఎండోక్రినాలజీ (న్యూఢిల్లీ), ఫోర్టిస్‌ –సీ–డాక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ డయాబెటీస్‌, ప్రొఫెసర్‌ అండ్‌ ఛైర్మన్ డాక్టర్‌ అనూప్‌ మిశ్రా మాట్లాడుతూ… త‌మ అధ్యయన ఫలితాలు సూచించే దాని ప్రకారం, డైటరీ వ్యూహాల్లో భాగంగా బ్లడ్‌ గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో అత్యంత కీలక తోడ్పాటుదారునిగా బాదములు ఉపయోగపడుతున్నాయన్నారు.

ఈ ఫలితాలు చూపే దాని ప్రకారం కొద్ది మొత్తంలో బాదములను ప్రతి భోజనానికీ ముందు తీసుకోవడం వల్ల వేగంగా, అద్భుతంగా గ్లైసెమిక్‌ నియంత్రణ అనేది భారతదేశంలోని ఆసియన్‌ ఇండియన్స్‌లో సాధ్యమవుతుందన్నారు. మరీ ముఖ్యంగా కేవలం మూడు రోజుల్లో ప్రీ డయాబెటీస్‌ నియంత్రణలోకి వస్తుందన్నారు. ఒబేసిటీ అండ్‌ కొలెస్ట్రాల్‌ ఫౌండేషన్, నేషనల్‌ డయాబెటీస్ హెడ్‌–న్యూట్రిషన్‌ రీసెర్చ్‌ గ్రూప్ డాక్టర్‌ సీమా గులాటీ మాట్లాడుతూ… డయాబెటీస్‌ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా, ప్రధాన భోజనానికి 30 నిమిషాల ముందు బాదంపప్పులు తీసుకోవడం వంటి ఆహార వ్యూహాలు భోజనం తరువాత రక్తంలో గ్లూకోజ్‌ స్ధాయిలను తగ్గించడానికి మంచి ఎంపికగా నిలుస్తాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement