Monday, November 25, 2024

Almonds: బాదం కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది.. నూతన అధ్యయనంలో వెల్లడి..

హైదరాబాద్: బాదంపప్పులు తినడం వల్ల వ్యాయామం రికవరీ సమయంలో కండరాల నొప్పులు తగ్గాయని, ఇది వర్టికల్ జంప్ ఛాలెంజ్‌లో మెరుగైన కండరాల పనితీరుకు తోడ్పడుతుందని నూతన అధ్యయనం కనుగొంది. వ్యాయామం తర్వాత కండరాల పునరుద్ధరణను బాదం ఎలా ప్రభావితం చేస్తుందో తెలిపే గత అధ్యయనాన్ని ఈ ఫలితాలు విస్తరిస్తాయి. ఈసందర్భంగా సీనియర్ లెక్చరర్ డాక్టర్ ఆలివర్ సి.విటార్డ్ మాట్లాడుతూ… అప్పుడప్పుడు వ్యాయామం చేసేవారికి కఠినమైన వ్యాయామం తర్వాత ఫిట్‌నెస్ రికవరీకి సహాయ పడటానికి ఆహారంగా బాదంపప్పులను సిఫార్సు చేయవచ్చని తమ అధ్యయనం సూచిస్తుందన్నారు.

బాదంలో ప్రొటీన్లు, మంచి కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సహజంగా పోషకాలు ఉంటాయన్నారు. ఢిల్లీ మాక్స్ హెల్త్ కేర్, డైటీటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమద్దర్ మాట్లాడుతూ… సంవత్సరాలుగా తాను తన రోగులకు ప్రతి రోజూ బాదంపప్పును తినాలని సిఫార్సు చేస్తున్నానన్నారు. విటార్డ్ అధ్యయనం ఫలితాలు ప్రతిరోజూ బాదంపప్పును తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయని, కండరాల పనితీరును మెరుగు పరుస్తుందని వెల్లడించిందన్నారు.

పోషకాహార నిపుణులు, ఎంబీబీఎస్ డాక్టర్ రోహిణి పాటిల్ మాట్లాడుతూ… ఈ తాజా అధ్యయనం కండరాల పునరుద్ధరణ, పనితీరులో బాదం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుందన్నారు. బాదంపప్పును తీసుకునే వారిలో కండరాల నొప్పులు గణనీయంగా తగ్గడం, వ్యాయామం తర్వాత కోలుకునే వారి సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుందన్నారు. చివరికి మెరుగైన కండరాల పనితీరుకు దారి తీస్తుందన్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం బాదం పప్పులను మీ ఆహారంలో చేర్చుకోవాలని తాను బాగా సిఫార్సు చేస్తున్నానన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement