Thursday, November 21, 2024

రాత్రి క‌ర్ఫ్యూతో మ‌ళ్లీ అవే ఇబ్బందులు…

హైదరాబాద్‌, : తెలంగాణ ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూపై సంచలన నిర్ణయం తీసుకోగా, ఈ కర్ఫ్యూ కారణంగా.. రాత్రి వ్యాపారాలే ప్రధానంగా జరిగే రంగాలన్నీ.. కుదేలుకానున్నాయి. గత ఏడాది విధించిన లాక్‌డౌన్‌ ఎత్తివేశాక.. ప్రజ లు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విందులు, వినోదాల్లో మునిగితేలడం, కనీ స జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. ఓ వైపు పెరుగుతున్న కరోనా.. మరోవైపు కట్టడి చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించకుండా కేవలం నైట్‌ కర్ఫ్యూకే ప్రభుత్వం పరిమి తమైంది. నైట్‌ కర్ఫ్యూతో కట్టడికాకుంటే, ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడకుంటే.. ఇంత కంటే తీవ్ర నిర్ణయాలు తప్పవని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో అనేకరంగాలు పూర్తిగా ఎఫెక్ట్‌ కానున్నాయి. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌ కారణంగా.. ఆయా రంగాలు పూర్తి ఆక్యుపెన్సీని సాధించని పరిస్థితి ఉండగా, ఇపుడు నైట్‌ కర్ఫ్యూ, విస్తరిస్తున్న కరోనా మొత్తం థియేటర్‌ పరిశ్రమకు షాకిచ్చింది. ఒక్క సినిమాపరిశ్రమే కాదు.. బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు కేవలం ఒక్కపూటతో వ్యాపారం కొనసాగించలేవు కాబట్టి.. పూర్తిగా షట్‌డౌన్‌ కానున్నాయి. నైట్‌ బజార్లు, సాయంత్రం నిర్వహించే ఫుట్‌ పాత్‌ వ్యాపారాలు, టిఫి న్‌ సెంటర్లు, పానీపూరీబండ్లు, చైనీస్‌ ఫుడ్‌ వ్యాపారాలు అన్నీ బంద్‌ కానున్నాయి. ఐటీ పరిశ్రమకు కర్ఫ్యూ నుండి మినహాయింపునివ్వగా, ఇతర వాణిజ్య కార్య కలాపాలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనబడుతోంది. రోడ్లపై ప్రజల కదలికలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ఆఫీసులు, బార్లు, క్లబ్‌లు, పబ్‌లు, థియే టర్లు అన్నీ బంద్‌ అయితే.. జనసంచారంపై ఆధారపడి మనుగడ సాగించే నగరం లోని వ్యాపారాలన్నీ తీవ్ర ప్రభావానికి లోనుకానున్నాయి. అన్ని షాపింగ్‌ మాల్స్‌, వ్యాపారాలపై కూడా దీని ప్రభావం పడనుంది. ఇపుడిపుడే కోలుకుంటున్న దశలో కరోనా విస్తరించడం, హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం నైట్‌ కర్ప్యూ విధించడంతో ఆర్ధికంగా ఆయా కుటంబాలపై ప్రభావం పడనుంది. ప్రధానంగా సైబరాబాద్‌, జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌ వంటి ప్రాంతాల్లోని వ్యాపారాలు, వాణిజ్య కార్య కలాపాలపై ప్రభావం పడనుంది. మెట్రో వేళలు 7.45వరకే కుదించడం, ఆర్టీసి సర్వీసులపై ఆంక్షలు పెట్టడంతో పేద, మధ్యతరగతి వర్గాలపై ప్రభావం పడనుంది.
వైద్యసేవలకు ఉపశమనం
మీడియా, టెలి కమ్యూనికేషన్స్‌, ఇంటర్నెట్‌, సరుకు రవాణా, ఎల్పీజీ, పెట్రో ల్‌ బంకులు, విద్యుత్‌ సంస్థలు, నీటి సరఫరా, పారిశుధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ, రాత్రి షిఫ్టుల్లో పని చేసే పరిశ్రమలు, ఆసుపత్రులు, మెడికల్‌ ల్యాబ్‌లు, ఫార్మసీ దుకాణాలు, డాక్టర్లు, నర్సులు, గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల సిబ్బంది, గర్భి ణీలు, పేషంట్లకు మినహాయింపు నివ్వడం ఊరట కలిగించే అంశం.
అయితే ఇబ్బ ందుల్లో ఉన్నవారి.. ప్రయాణాలకు ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసువర్గాలు హెచ్చరిస్తున్నాయి. నైట్‌ కర్ఫ్యూకే ఇది పరిమితం కావాలని, లాక్‌ డౌన్‌కు దారితీయొద్దని.. ఆయా వర్గాలు కోరుకుంటుండగా, నైట్‌ కర్ప్యూతో ఉపయోగం లేదని పగలు కర్ఫ్యూ లేదా 144సెక్షన్‌ విధించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement