Sunday, November 17, 2024

ప్ర‌పంచ‌మంతా తెలంగాణ వైపు…కెటిఆర్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఇండియన్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ- రామారావు అన్నారు. దేశంలోకి ఏ పెట్టుబడిదారుడు వచ్చినా, ముందుగా హైదరాబాద్‌ వైపే చూస్తున్నారని, ఇది ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో అమెజాన్‌ ఎయిర్‌ కార్గో సేవలను మంత్రి కేటీ-ఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు అతి పెద్ద క్యాంపస్‌ హైదరాబాద్‌లోనే ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే అమెజాన్‌ సంస్థ హైదరాబాద్‌లో భారీ పెట్టు-బడు లతో ప్రత్యేకతను చాటిందని, ఇకనుంచి అది కొనసాగుతుందని తెలిపారు. దేశంలో తెలంగాణ అత్యంత వేగంగా అభవృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉండడా నికి ఇక్కడి వనరులు, మౌలిక వసతులే ప్రధాన కారణమని చెప్పారు.

గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా భారీగా పెట్టు-బడులను ఆకర్షించామని వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల వల్ల గత కొన్నేళ్ళుగా రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెజాన్‌ బృందాన్ని అభినందిం చారు. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ద్వారా రూ.36,300 కోట్ల పెట్టు-బడులు రాబోతు న్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏవియేషన్‌ రంగంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌ అని చెప్పారు. అంతేకాకుండా ఈ నగరం గ్రీన్‌సిటీ- అవార్డును సొం తం చేసుకున్నదన్న విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఆయన దావోస్‌ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత మొదటి ప్రారంభం కావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సంస్థకు హైదరాబాద్‌ నగరం కలిసివచ్చిన రాష్ట్రం. భారత్‌లో ఆ సంస్థ మొట్టమొదటిగా ప్రారంభించిన ఎయిర్‌ కార్గో సేవలను ఇక్కడి నుంచే ప్రారంభించడం అందుకు నిదర్శనం. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు వస్తువులను రవాణా చేయడం ఈ కార్గో సేవల వల్ల మరింత సులభతరం అవుతుంది. అమెజాన్‌ ఎయిర్‌ కార్గో సేవల్లో భాగంగా ముంబై, బెంగళూరు, హైదరా బాద్‌, ఢిల్లీ నగరాలకు వస్తువులను త్వరతిగతిన డెలివరీ చేయడానికి బోయింగ్‌ 737-800 విమా నాలను వినియోగించనున్నారు. ఇందుకోసం బెంగ ళూరుకు చెందిన క్విక్‌జెట్‌ సంస్థతో అమెజాన్‌ సంస్థ వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌లో ఇ-కామర్స్‌ సంస్థ థర్డ్‌ పార్టీ విమాన సేవలను వినియోగించుకోవడం ఇదే తొలిసారి. తొలుత 2016లో అమెరికాలో అమెజాన్‌ ఎయిర్‌ సేవలు ప్రారంభమయ్యాయి.
తర్వాత యూకేకు విస్తరించారు. అమెరికా, యూకే తర్వాత ఈ సేవలను భారత్‌లో అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. భారత్‌లో ఈ సేవలను ప్రైమ్‌ ఎయిర్‌ పేరిట తీసుకొచ్చారు. అమెజాన్‌ ప్రతిని ధులతో మంత్రి కేటీ-ఆర్‌ అమెజాన్‌ ప్రతినిధులతో మంత్రి కేటీ-ఆర్‌ అమెజాన్‌ ఎయిర్‌ వల్ల సుమారు 11 లక్షల మంది సెల్లర్లకు మేలు చేకూరనుందని అమెజాన్‌ ప్రతినిధి అఖిల్‌ సక్సేనా తెలిపారు. డెలివరీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠ పరిచేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు- ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement