న్యూట్రిషన్ మాసంలో గుండెకు ఆరోగ్యం అందించే ఆహారానికి సమ్మతి తెలపాలని ఢిల్లీ మ్యాక్స్ హెల్త్ కేర్ డైటెటిక్స్ రీజనల్ హెడ్ రితికా సమద్దార్ తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ను పౌష్టికాహార మాసం (న్యూట్రిషన్ మంత్) లేదంటే పోషన్ మాహ్ గా నిర్వహిస్తుంటారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఒక్క క్షణం ఆగి, తమ జీవనశైలి ఎంపికలను సమీక్షించుకోవాల్సిందిగా గుర్తుచేసే నెల ఇదని, అదే సమయంలో తమతో పాటుగా తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం అత్యంత కఠినమైన నిర్ణయాలనూ తీసుకోవాల్సిన ఆవశ్యకతను సైతం తెలుపుతుందన్నారు. సమతుల ఆహారం తీసుకోవడం అనేది అతి సరళమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటన్నారు. ఇది గుండె వ్యాధుల ప్రమాదం తగ్గించడం మాత్రమే కాదని, ఒకరి ఆరోగ్య ఆందోళనలకు సైతం తగిన పరిష్కారాలను అందిస్తుందన్నారు. పౌష్టికాహారంతో ఒకరి ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం లేదా నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. ఈ పౌష్టికాహారంలో అత్యధిక పోషకాలు కలిగిన ఆహరం, తీసుకునే ఆహారంలో నియంత్రణ వంటివి కూడా భాగంగా ఉంటాయన్నారు. సమతుల, పోషక విలువలు కలిగిన డైట్‌తో గుండె వ్యాధుల ప్రమాదం తగ్గడంతో పాటుగా కొలెస్ట్రాల్ స్థాయి కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. ఇక్కడ మూడు అత్యున్నతమైన, గుండెకు ఆరోగ్యం అందించే ఆహారాలలో బాదములు, తృణధాన్యాలు, బెర్రీలు ఉన్నాయన్నారు.
బాదములు :
ఓ గుప్పెడు బాదములను ఒకరి రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవడం చక్కటి ఆరంభమన్నారు. వీటిలో విస్తృతశ్రేణిలో పోషకాలు ఉంటాయన్నారు. ఇవి ఆరోగ్యవంతమైన స్నాకింగ్ అవకాశంగా నిలపడంతో పాటుగా ప్రజల గుండె ఆరోగ్యానికీ తోడ్పడతాయన్నారు. బాదములలో 14 అత్యవసర పోషకాలుంటాయన్నారు. అవి విటమిన్ ఈ, మెగ్నీషియం, ప్రొటీన్, రిబోఫ్లావిన్, జింక్ మొదలైనవన్నారు. పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం క్రమం తప్పకుండా బాదములు తినడం వల్ల ఎల్‌డీఎల్ అండ్ టోటల్ కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటుగా ఒకరి గుండె ఆరోగ్యానికి సైతం తోడ్పడుతుందన్నారు. అనారోగ్యకరమైన స్నాక్స్‌కు బదులుగా బాదములు తింటే, ఒకరి జీవితంలో ఆరోగ్యవంతమైన మార్పులను చూడవచ్చన్నారు.
తృణధాన్యాలు :
తృణధాన్యాలలో ప్రొటీన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, విటమిన్స్ ఉంటాయన్నారు. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం తృణ ధాన్యాల కారణంగా కార్డియోవాస్క్యులర్ వ్యాధులు అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయన్నారు. వీటిద్వారా టోటల్ కొలెస్ట్రాల్ 8శాతం తగ్గుతుందన్నారు. గోధుమలు, బియ్యంను అధికంగా తీసుకుంటున్నప్పటికీ తృణ ధాన్యాలైనటువంటి పెరల్ మిల్లెట్ (సజ్జలు), ఫాక్స్‌టైల్ మిల్లెట్ (కొర్ర), సోర్గమ్ (జొన్నలు), ఫింగర్ మిల్లెట్ (రాగులు) మొదలైనవి భారతదేశంలో లభిస్తోన్న ఆరోగ్యవంతమైన ఆహార పదార్ధాలుగా ఉన్నాయన్నారు.
బెర్రీలు :
బెర్రీలలో చక్కటి పౌష్టికాహార ప్రొఫైల్ ఉందన్నారు. వీటిలో ఫైబర్, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్ పాలీఫినాల్స్ అధికంగా ఉంటాయన్నారు. ఈ ఫలితంగా బెర్రీలను ఒకరి డైట్‌లో జోడించడం ద్వారా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలను నియంత్రించడం సాధ్యపడుతుందన్నారు. అదనంగా ఒకరు తమ డైట్‌లో స్థానికంగా లభించే స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, రాస్ప్‌బెర్రీ, మల్‌బెర్రీ మొదలైనవి జోడించడం ద్వారా పాలిపెనాల్స్ మరీ ముఖ్యంగా ఆంథోసియానిన్స్, మైక్రో న్యూట్రియంట్స్, ఫైబర్ జోడించవచ్చన్నారు. పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం, బెర్రీలతో కార్డియోవాస్క్యులర్ రిస్క్ ప్రొఫైల్స్ కూడా మెరుగుపడతాయన్నారు. బెర్రీలతో గణనీయంగా ఎల్‌డీఎల్ ఆక్సిడేషన్, లిపిడ్ పెరాక్సిడేషన్, టోటల్ ప్లాస్మా యాంటీ ఆక్సిడెంట్ సామర్ధ్యం,డిస్లిపిడెమియా, గ్లూకోజ్ మెటబాలిజం కూడా మెరుగుపడతాయని రితికా సమద్దార్ తెలిపారు.