Monday, September 16, 2024

HYD: శ్రీ సిటీ – ఇండస్ట్రియల్ పార్క్‌ కోసం భాగస్వామిగా ఏజీ అండ్ పీ ప్రథమ్ సంస్థ

హైద‌రాబాద్ : భారతదేశంలోని ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ఏజీ అండ్ పీ ప్రథమ్ సంస్థ శ్రీ సిటీ ఇంధన అవసరాలను పునరావిష్కరించటంలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తిస్తూ సమగ్ర గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ ను అభివృద్ధి చేయటం ప్రారంభించింది. శ్రీ సిటీలోని పారిశ్రామిక, వాణిజ్య అండ్ నివాస రంగాలకు ఆధార పడతగిన, తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణ అనుకూల సహజ వాయువు ఆత్మాభ్యలను అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇటీవల జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. శ్రీ సిటీ అండ్ ఆంధ్రప్రదేశ్ సుస్థిర అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో ఏజీ అండ్ పీ ప్రథమ్ సంస్థ నిబద్ధతను తెలియపరుస్తుంది.

ఈ భాగస్వామ్యం పై ఏజి అండ్ పి ప్రథమ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అభిలేష్ గుప్తా మాట్లాడుతూ… పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు నమ్మకమైన ఇంధన పరిష్కారాన్ని అందించే సహజ వాయువు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి శ్రీ సిటీతో భాగస్వామ్యం చేసుకోవటానికి తాము సంతోషిస్తున్నామన్నారు. భవిష్యత్తులో రాబోయే నూతన పారిశ్రామిక సంస్థలను సజావుగా కనెక్ట్ చేసే విదంగా సమగ్ర గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌తో ఇంధన ల్యాండ్‌స్కేప్‌ను మార్చాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నందున ఈ అసోసియేషన్ గణనీయమైన పురోగతిని సూచిస్తుందన్నారు.

ఏజి అండ్ పి ప్రథమ్ సంస్థ నెల్లూరు, చిత్తూరు అండ్ తిరుపతి, ఏజి అండ్ పి ప్రథమ్ సంస్థ రీజిన‌ల్ హ‌శ్రీ‌డ్ గౌతమ్ ఆనంద్ మాట్లాడుతూ… ఏజి అండ్ పి ప్రథమ్ సంస్థ తిరుపతి, చిత్తూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప అన్నమయ్య, శ్రీ సత్యసాయి అండ్ అనంతపురంతో సహా ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేస్తోందన్నారు. తాము ఇప్పటికే 3 లైవ్ ఎల్ సీఎన్జీ స్టేషన్‌లతో సహా 56 సీఎన్జీ స్టేషన్‌లను ప్రారంభించామన్నారు. శ్రీ సిటీలో సీఎన్జీని పర్యావరణ అనుకూల మొబిలిటీ పరిష్కారంగా పరిచయం చేస్తుండటం పట్ల తాము చాలా సంతోషంగా వున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement